విజయవాడలో కుండపోత వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం

విజయవాడలో కుండపోత వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం


దేశంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దీంతో పలు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం ఏపీలోనూ వర్షాలు కురిశాయి. విజయవాడలో ఈ మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. గంటన్నర పాటు కుండపోత వర్షం కురిసింది. దీంతో విజయనగరంలోని లోతట్టు ప్రాంతాలన్ని జలమయం అయ్యాయి. పలుచోట్ల కాలువకు పొంగిపార్లాయి. పలు కాలనీల్లో భారీ వర్షపు చేరింది. దీంతో మురుగు నీరు రోడ్లపై పారింది. ఆటో నగర్, మెఘల్ రాజ్ పురం, ఏలూరు, బందరు రోడ్డు వర్షపు నీరు నిలిచిపోయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలు కాలనీల్లో ఇళ్లలోకి నీళ్లు వెళ్లాయి. అటు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది.

అయితే అప్రమత్తమైన అధికారులు వర్షం నిలిచి వెంటనే సహాయ చర్యలు చేపట్టారు. విద్యుత్‌ను పునరుద్ధరించారు. వర్షాల నేపథ్యంలో ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచించారు. మరో నాలుగు రోజుల పాటు వర్ష సూచనతో ప్రతిఒక్కరూ అలర్ట్‌గా ఉండాలని, పిడుగులు పడే అవకాశం ఉందని చెట్ల కింద ఉండొద్దని తెలిపారు.