హైదరాబాద్ శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఊరేగింపు రథానికి విద్యుత్ తీగలు తగలడంతో ఐదుగురు మృతి చెందారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. రథాన్ని ఊరేగింపు చేస్తుండగా, విద్యుత్ షాక్..
హైదరాబాద్ శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఊరేగింపు రథానికి విద్యుత్ తీగలు తగలడంతో ఐదుగురు మృతి చెందారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. రథాన్ని ఊరేగింపు చేస్తుండగా, విద్యుత్ షాక్ తగలి ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన ఉప్పల్ పీఎస్ పరిధిలోని రామంతాపూర్‌లో చోటు చేసుకుంది. మృతులు కృష్ణ యాదవ్ (24), శ్రీకాంత్‌రెడ్డి (35), సురేష్ (34), రుద్రవికాస్ (39), రాజేంద్రరెడ్డి (39)గా గుర్తించారు పోలీసులు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
గోకుల్‌నగర్ దగ్గర ఊరేగింపు ముగిశాక.. రథాన్ని లోపలికి తోస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. విద్యుత్ తీగలు రథానికి తగలడంతో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడినవారిలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి గన్‌మెన్ శ్రీనివాస్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
































