రైలు ప్రయాణికులకు అలర్ట్.. జనవరి 1 నుంచి మారనున్న రైళ్ళ వేళలు

రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక. రైలు ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలను కల్పించి, వారి ప్రయాణ అవసరాలకు తగ్గట్టుగా రైలు సేవలను అందిస్తున్న ఇండియన్ రైల్వే దేశవ్యాప్తంగా జనవరి ఒకటవ తేదీ నుండి పలు రైళ్ల రాకపోకలలో స్వల్ప మార్పులు చేస్తోంది.


పలు రైళ్ల వేళల్లో స్వల్ప మార్పులు రానున్న క్రమంలో ప్రయాణికులు దీనిని గమనించాలని సూచిస్తోంది.

రైళ్ళ వేళల్లో మార్పులు

సాధారణంగా ప్రతి సంవత్సరం రైల్వే జులై 1వ తేదీన అమలయ్యే విధంగా షెడ్యూల్ సవరణను చేస్తుంది. అయితే ఈసారి రైల్వే శాఖ ఆరు నెలల ముందుగానే రైళ్ల షెడ్యూల్ సవరణను జనవరి ఒకటవ తేదీ నుండి చేయనుంది. ఈ మార్పులను ప్రయాణికులు గమనించాలని రైల్వే సూచించింది.

దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 80 కి పైగా రైళ్ల వేళలు మార్పు

దేశవ్యాప్తంగా 1400 రైళ్ల వేళలలో ఈ మార్పులు జరగనున్నాయి. ఇక దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 80 కి పైగా రైళ్ల వేళలు మూడు నిమిషాల నుండి గరిష్టంగా 30 నిమిషాల వరకు మారుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ఇక సవరించిన రైళ్ల వేళలను చెక్ చేసుకున్న తర్వాతనే తదనుగుణంగా ప్రయాణికులు స్టేషన్లకు చేరుకోవాలని దక్షిణ మధ్య రైల్వే సి పి ఆర్ ఓ వెల్లడించారు.

టికెట్ రిజర్వ్ చేసుకున్న వారికి ఎస్ఎంఎస్

ముందే టిక్కెట్లు రిజర్వు చేసుకున్న వారికి వేళలు మారితే ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం అందుతుందని దానిని చూసుకుని ప్రయాణ సమయాన్ని ఫిక్స్ చేసుకోవాలని సూచిస్తున్నారు. ఇదిలా ఉంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పనులు తుది దశకు చేరుకోవడంతో, ఈ పునరుద్ధరణ కారణంగా కొన్ని నెలలు ప్లాట్ఫామ్ లలో రైళ్ల రాకపోకలు దశలవారీగా నిలిచిపోతున్నాయి. ఇది షెడ్యూల్ మార్పులను ప్రభావితం చేస్తోంది.

సికింద్రాబాద్ పనులతో రైళ్ల వేళలలో అదనపు మార్పులు

సికింద్రాబాద్ పనుల కారణంగా చాలా రైళ్లను చర్లపల్లి టెర్మినల్ నుంచి నడుపుతున్నారు రైల్వే అధికారులు. త్వరలోనే మరిన్ని రైళ్లు అక్కడ నుండి బయలుదేరుతాయి. ఇక రైళ్ల వేళలలో అదనపు మార్పులు కూడా ఉంటాయని చెబుతున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.