తెలుగు రాష్ట్రాలకు రెండు వందేభారత్ స్లీపర్లు ఖరారు- రూట్, ముహూర్తం ఫిక్స్

తెలుగు రాష్ట్రాల్లోని రైల్వే ప్రయాణీకులకు బిగ్ అప్డేట్. రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 18న వందేభారత్ స్లీపర్ తొలి రైలు పట్టాలెక్కనుంది.


గువాహటి-కోల్‌కతా మధ్య తొలి రైలును ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. తొలి విడతలో 15 రైళ్లు ప్రారంభం అవుతున్నాయి. కాగా, ఈ తొలి విడతలో తెలుగు రాష్ట్రాలకు రెండు సర్వీసులు కేటాయించేందుకు రైల్వే బోర్డు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు రైళ్ల మార్గాలు దాదాపు ఖరాయ్యాయి. ఈ రైళ్లు అందుబాటు లోకి రావటం ద్వారా ప్రయాణీకులకు వెసులుబాటు కలగనుంది.

వందేభారత్‌ స్లీపర్‌ కోచ్‌ రైళ్లు ఈ నెల 18న పట్టాలెక్కనున్నాయి. గువాహటి-కోల్‌కతా మధ్య తొలి రైలును ప్రారంభించనున్నారు. తొలి విడతలో 15 వందేభారత్ స్లీపర్ రైళ్లను ప్రారంభించేందుకు నిర్ణయించారు. కాగా, వీటిల్లో తెలుగు రాష్ట్రాలకు రెండు కేటాయించినట్లు సమాచారం. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో అయిదు వందేభారత్ రైళ్లు కొనసాగుతున్నాయి. అయితే, వందేభారత్ స్లీపర్ కోసం తెలుగు రాష్ట్రాల నుంచి డిమాండ్ పెరుగుతోంది. వందేభారత స్లీప్ రైళ్లల్లో ఏపీ ఫస్ట్‌ క్లాస్‌, సెకండ్‌ క్లాస్‌ ఏసీ, ఏసీ త్రీ టైర్‌ అందుబాటులో ఉంటాయి. మొత్తం 1,128 బెర్తులు ప్రయాణీకు లకు అందుబాటులో ఉంటాయి. మొత్తం 24 వందేభారత్ స్లీపర్ రైళ్ల కోసం ప్రస్తుతం ఆర్డర్లు ఉన్నాయి. ఇక, తెలుగు రాష్ట్రాల నుంచి తొలి వందేభారత్ స్లీపర్ రైలు విజయవాడ నుంచి అయోధ్య / వారణాసి వరకు కేటాయించాలని సూత్ర ప్రాయంగా నిర్ణయం తీసుకున్నారు.

విజయవాడ నుంచి వరంగల్ మీదుగా ప్రస్తుతం రెగ్యులర్ రైళ్లు ప్రయాణించే మార్గంలోనే వందే భారత్ స్లీపర్ ను అయోధ్య కు కేటాయించేలా నిర్ణయం ఉంటుందని తెలుస్తోంది. రాత్రి సమయం లోనే ఈ రైలు ఉండేలా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. అదే విధంగా సికింద్రాబాద్ నుంచి ఢిల్లీ కి వందేభారత్ స్లీపర్ రైలు ప్రతిపాదన పైన తుది కసరత్తు జరుగుతోంది. రైల్వే మంత్రికి నేరుగా ఈ రైలు కేటాయింపు కోసం వినతులు వస్తున్నాయి. అదే విధంగా విశాఖ నుంచి తిరుపతి, సికిందర్ రాబాద్ నుంచి తిరుపతి ప్రతిపాదన పైన కసరత్తు కొనసాగుతోంది. అయితే, దశల వారీగా సర్వీసు లను పెంచుతామని.. ముందుగా విజయవాడ నుంచి అయోధ్య, అదే విధంగా సికింద్రాబాద్ నుంచి తిరుపతికి రెండు వందే భారత్ స్లీపర్ రైళ్లను తొలి విడతలో కేటాయించే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ మార్గాల్లో రద్దీ.. ఆక్యుపెన్సీ…డిమాండ్ పరిగణలోకి తీసుకుంటున్నారు. ప్రస్తుతం తొలి విడత వందేభారత్ స్లీపర్ పట్టాలెక్కించేలా ప్రయత్నాలు సాగుతున్నాయి. ఒకటి, రెండు రోజుల్లోనే ఈ రైళ్ల పైన అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం కనిపిస్తోంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.