టీసీఎస్‌లో తొలగించినవాళ్లకు రెండేళ్లు జీతం

దేశంలోని అతిపెద్ద ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) భారీగాతొలగింపులనుప్రకటించినసంగతితెలిసిందే. అయితేతొలగింపు కారణంగా ప్రభావితమైన ఉద్యోగుల కోసం కంపెనీ ఆకర్షణీయమైన సెవెరన్స్ ప్యాకేజీలను ప్రకటించినట్లు మీడియా నివేదికలు తెలిపాయి.


మారుతున్న టెక్నాలజీ, కంపెనీ అవసరాలకు సరిపోలని ఉద్యోగులకు ఆరు నెలల నుండి గరిష్టంగా రెండేళ్ల వరకు జీతం ప్యాకేజీని అందిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. తొలగింపునకు గురైన ఉద్యోగులకు టీసీఎస్ఇంకాఏమేమిఆఫర్చేస్తోందోఈకథనంలోచూద్దాం.

12,000 మందికిఉద్వాసన

మనీకంట్రోల్ నివేదిక ప్రకారం.. టీసీఎస్ తన ఉద్యోగులలో సుమారు2 శాతం లేదా సుమారు 12,000 మందిని వచ్చే సంవత్సరంలో తొలగించాలని నిర్ణయించింది. టెక్నాలజీ మార్పు, ఆటోమేషన్ యుగంలో చురుకైన, భవిష్యత్తుకు సిద్ధంగా ఉండటానికి ఈ దశ అవసరమని కంపెనీ నమ్ముతోంది.

మీడియా నివేదికలు ఉటంకించిన కంపెనీ వర్గాల ప్రకారం.. ఈ తొలగింపులు ప్రధానంగా ఎవరినైపుణ్యాలు అవసరాలకుతగినట్లులేవో, ఎవరైతేతమనైపుణ్యాలనుమెరుగుపరుచుకోలేదోఅలాంటి ఉద్యోగులను ప్రభావితం చేస్తున్నాయి.

కంపెనీఇస్తున్నఆఫర్లు..

ఉద్యోగులకు వారి సేవా వ్యవధిని బట్టి మూడు నెలల నోటీసు వ్యవధి, ఆరు నెలల నుండి 24 నెలల వరకు సెవెరన్స్ ప్యాకేజీని అందిస్తున్నారు. పదవీ విరమణ వయస్సుకు దగ్గరగా ఉన్న ఉద్యోగులకు కూడా కంపెనీ ముందస్తు పదవీ విరమణ ఎంపికలను విస్తరిస్తోందని మీడియా నివేదికలు చెబుతున్నాయి. ఈ పథకం కింద, వారు బీమా వంటి పూర్తి పదవీ విరమణ ప్రయోజనాలతో పాటు వారికిఇంకామిగిలిఉన్నసర్వీస్కాలాన్ని బట్టి ఆరు నెలల నుండి రెండు సంవత్సరాల జీతానికి సమానమైన అదనపు సెవెరన్స్ప్యాకేజీని పొందుతారు.

సెవెరన్స్ప్యాకేజీలు ఇలా..

స్టాండర్డ్ ఆఫర్: 3 నెలల నోటీసు పీరియడ్ పే.

10-15 సంవత్సరాల సర్వీసు:1.5 సంవత్సరాల జీతం.

15ఏళ్లకంటేఎక్కువ సర్వీసు: 2 సంవత్సరాల వరకు జీతం

బెంచ్ ఉద్యోగులు (8నెలలకుపైగావర్క్అసైన్కానివారు): 3 నెలల నోటీసు వేతనం మాత్రమే.

కెరీర్ అవుట్ ప్లేస్ మెంట్: రెజుమ్తయారీ, జాబ్సెర్చ్లోసహాయం, ఇంటర్వ్యూ ప్రిపరేషన్ (3 నెలలపాటు ఏజెన్సీ ఫీజులు).

మానసిక ఆరోగ్య మద్దతు: “టీసీఎస్ కేర్స్” ప్రోగ్రామ్ ద్వారాసహాయం.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.