PM Internship 2025 Scheme: టెన్త్ పూర్తయిందా.. ఈ స్కీం కింద నెలకు రూ.5వేలు

ప్రధాన మంత్రి ఇంటర్న్‌షిప్ 2025 పథకం రెండవ రౌండ్ కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ప్రతి నెలా రూ.5వేల స్టైఫండ్ లభిస్తుంది.


కాబట్టి, ఆసక్తి ఉన్న విద్యార్థులు వెంటనే కింద ఇచ్చిన లింక్ సాయంతో దరఖాస్తు చేసుకోండి. ఇందుకు కేవలం వారం రోజులే గడువుంది. కాబట్టి, చివరి నిమిషం వరకూ వేచి చూడకుండా వీలైనంత త్వరగా మీ మీ దరఖాస్తులను సమర్పించండి. ఈ తేదీకి ముందే PM ఇంటర్న్‌షిప్ అధికారిక వెబ్‌సైట్ (pminternship.mca.gov.in)లో నమోదు చేసుకోండి.

నో రిజిస్ట్రేషన్ ఫీజు..

పరిశ్రమలోని యువతకు ఆచరణాత్మక అనుభవాన్ని అందించే లక్ష్యంతో ఈ పథకాన్ని నిర్వహిస్తున్నారు. మొదటి దశ దరఖాస్తు ప్రక్రియ పూర్తయిన తర్వాత, మంత్రిత్వ శాఖ తిరిగి నమోదుకు అవకాశం కల్పించింది. అభ్యర్థులు మార్చి 12, 2025 వరకు నమోదు చేసుకోవచ్చు. మీ ప్రొఫైల్‌ క్రియేట్ చేసి వివిధ రంగాలలోని అవకాశాల కోసం దరఖాస్తు చేసుకోండి. రిజిస్ట్రేషన్ లేదా దరఖాస్తు రుసుము లేదు.

అర్హత :

ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 21 నుండి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. అయితే OBC,SC,STఅభ్యర్థులకు నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. కుటుంబ వార్షిక ఆదాయం రూ. 8 లక్షల కంటే తక్కువగా ఉండాలి. కానీ, బీ.టెక్, ఎంబీఏ, సిఏ, IITలు, IIMలు, జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాల నుంచి ప్రొఫెషనల్ డిగ్రీలు కలిగిన అభ్యర్థులు ఈ పథకానికి అర్హులు కారు.

వివిధ వర్గాల అభ్యర్థులు విద్యార్హతను బట్టి దరఖాస్తు చేసుకోవచ్చు. ఐటీఐ అభ్యర్థులు గుర్తింపు పొందిన సంస్థ నుండి సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐతో పాటు 10వ తరగతి పూర్తి చేసి ఉండాలి. డిప్లొమా హోల్డర్లకు, 12వ తరగతితో పాటు AICTE గుర్తింపు పొందిన డిప్లొమా తప్పనిసరి. అదే సమయంలో, గ్రాడ్యుయేట్ స్థాయిలో దరఖాస్తు చేసుకునే వారు UGC లేదా AICTE ద్వారా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేట్ డిగ్రీని కలిగి ఉండాలి.

స్టైఫండ్ :

ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ పథకం 2025 కింద ఎంపికైన అభ్యర్థులకు ప్రతి నెలా రూ. 5,000 స్టైఫండ్ లభిస్తుంది. ఇందులో కేంద్ర ప్రభుత్వం రూ.4,500, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సిఎస్ఆర్) నిధి నుండి రూ.500 ఇస్తారు. ఇది కాకుండా అభ్యర్థులకు అదనంగా ఒకేసారి రూ. 6,000 అందజేయబడుతుంది.

ఇలా దరఖాస్తు చేసుకోండి :

ముందుగా అధికారిక వెబ్‌సైట్ pminternship.mca.gov.inని సందర్శించండి.

హోమ్‌పేజీలో ‘రిజిస్ట్రేషన్ లింక్’ పై క్లిక్ చేయండి.

మీ మొబైల్ నంబర్‌ను నమోదు చేసుకుని మీరే లాగిన్ ఆధారాలను రూపొందించండి.

దరఖాస్తు ఫారమ్ నింపి అవసరమైన పత్రాలను (ఆధార్ కార్డు, విద్యా ధృవపత్రాలు, సెల్ఫ్ డిక్లరేషన్, ఇటీవలి పాస్‌పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్) అప్‌లోడ్ చేయండి.

ఫారమ్‌ను జాగ్రత్తగా తనిఖీ చేసి సమర్పించండి.

భవిష్యత్తు అవసరాల కోసం దరఖాస్తు ఫారమ్ ప్రింటవుట్ తీసుకోవడం మర్చిపోకండి.

ఎన్ని ఇంటర్న్‌షిప్ అవకాశాలకు దరఖాస్తు చేసుకోవచ్చు?

అభ్యర్థులు ఒకే సైకిల్‌లో గరిష్టంగా 5 ఇంటర్న్‌షిప్ ఎంపికలకు దరఖాస్తు చేసుకోవచ్చు. నచ్చిన రంగం, ఉండే ప్రాంతం, చేయాలనుకున్న పని, అర్హతల ఆధారంగా ఆప్షన్స్ ఎంచుకోవచ్చు.

పోర్టల్‌లో ఐదు ఇంటర్న్‌షిప్ ప్రాధాన్యతలను మార్చుకోవచ్చా?

అవును. దరఖాస్తు గడువుకు ముందు పోర్టల్‌లో మీ ఐదు ప్రాధాన్యతలను మీరు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు మార్చుకోవచ్చు. అయితే, మీరు మీ ప్రాధాన్యతలను సమర్పించిన తర్వాత మార్పులు చేయలేరు.

ఇష్టమైన ఐదు అవకాశాలలో దేనికైనా ఎంపిక కాకపోతే ఏమి చేయాలి?

దరఖాస్తు చేసుకున్న ఐదు అవకాశాలలో దేనికైనా అభ్యర్థులు ఎంపిక కాకపోతే, వారు PM ఇంటర్న్‌షిప్ పథకం కింద మరో రౌండ్లో తిరిగి దరఖాస్తు చేసుకోవచ్చు.

ఒక వ్యక్తికి గరిష్ఠంగా లభించే ఇంటర్న్‌షిప్ ఆఫర్‌లు ఎన్ని?

ఒక అభ్యర్థి రెండు ఇంటర్న్‌షిప్ ఆఫర్‌లను పొందవచ్చు. ఆఫర్ అందుకున్న తర్వాత అభ్యర్థి నిర్ణీత సమయ వ్యవధిలోపు ఆఫర్‌ను అంగీకరించవచ్చు/తిరస్కరించవచ్చు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.