టెక్నాలజీ పెరుగుతున్న సమయంలో సైబర్ నేరగాళ్లకు ఏ చిన్న అవకాశం దొరికినా చేతివాటం చూపిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న అనేకరకాలైన సైబర్ స్కామ్‌లలో USB ఛార్జర్ స్కామ్ కూడా ఒకటి. ఇది నేడు పెద్ద సమస్యగా అవతరిస్తోంది. దీంతో విమానాశ్రయాలు, కేఫ్‌లు, హోటళ్లు, బస్టాండ్‌లు వంటి బహిరంగ ప్రదేశాల్లో ఫోన్ ఛార్జింగ్ పోర్టల్‌లను ఉపయోగించవద్దని కేంద్రం పౌరులను హెచ్చరించింది.
సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చేయడానికి విమానాశ్రయాలు, కేఫ్‌లు, హోటళ్లు మరియు బస్టాండ్‌ల వంటి బహిరంగ ప్రదేశాల్లో USB ఛార్జింగ్ పోర్ట్‌లను ఉపయోగించుకుంటున్నట్లు తెలుస్తోంది. USB స్టేషన్‌లలో పరికరాలను ఛార్జింగ్ చేయడం వలన వినియోగదారులు జ్యూస్-జాకింగ్ సైబర్ దాడులకు గురవుతారు.
పబ్లిక్ ప్రదేశాల్లోని USB స్టేషన్‌లలో పరికరాలను ఛార్జింగ్ చేసినప్పుడు సైబర్ నేరగాళ్లు అందులోని డేటాను దొంగలించవచ్చు. లేదా డివైజ్‌లలో మాల్వేర్‌ని ఇన్‌స్టాల్ చేయడం వంటివి చేస్తారు. ఇలా ఒకసారి చేసిన తరువాత వ్యక్తిగత సమాచారం దొంగలించి బ్లాక్ మెయిల్ చేయడం వంటి వాటికి పాల్పడతారు. దీని ద్వారా వినియోగదారులు చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఇలాంటి సైబర్ దాడుల నుంచి తప్పించుకోవడం ఎలా?
పబ్లిక్ ప్రదేశాల్లో ఇన్‌స్టాల్ చేసిన USB ఛార్జింగ్ పోర్ట్‌లను ఎలాంటి పరిస్థితుల్లో ఉపయోగించకూడదు.
వ్యక్తిగత కేబుల్‌లు లేదా పవర్ బ్యాంక్‌లను మీ వద్ద ఉంచుకోవాలి
తెలియని డివైజ్‌లతో ఏమాత్రం ఛార్జ్ చేసుకోకూడదు, డివైజ్‌లను ఎప్పుడూ లాక్ చేసి ఉంచాలి.
మొబైల్ ఫోన్ ఆఫ్ చేసి ఉన్నప్పుడే ఛార్జ్ చేసుకోవడం ఉత్తమం
ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సైబర్ మోసాలకు గురైతే.. సైబర్ క్రైమ్ అధికారిక వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలి. లేదా 1930కి కాల్ చేయాలి.
Safety tip of the day: Beware of USB charger scam.#indiancert #cyberswachhtakendra #staysafeonline #cybersecurity #besafe #staysafe #mygov #Meity #onlinefraud #cybercrime #scam #cyberalert #CSK #cybersecurityawareness pic.twitter.com/FBIgqGiEnU
— CERT-In (@IndianCERT) March 27, 2024