వల్లభనేని వంశీకి ఏపీ హైకోర్టులో ఊరట దక్కింది. తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్న వంశీని విజయవాడ ఆయుష్ ఆసుపత్రిలో చేర్చాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.
మధ్యంతర బెయిల్ ఇవ్వాలని దాఖలు చేసిన అనుబంధ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ మేరకు కీలక ఆదేశాలు జారీ చేసింది. రేపు వంశీని విజయవాడలోని ఆయుష్ ఆసుపత్రిలో జాయిన్ చేయనున్నారు. నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో బెయిల్ ఇవ్వాలని వల్లభనేని వంశీ దాఖలు చేసిన పిటిషన్ పై వచ్చే గురువారం హైకోర్టు విచారణ చేస్తామని వాయిదా వేసింది. పూర్తి వివరాలు సమర్పించాలని పోలీసులకి ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
































