Vamu Rasam: వారంలో ఒక్కసారి వాము రసం తినండి.. పొట్టంతా క్లీన్!

www.mannamweb.com


వాము ఆరోగ్యానికి చాలా మంచిదన్న విషయం తెలిసిందే. ఇది వరకు వాము ఆకులు, వాము ఇంటి చుట్టుపక్కలే వేసేవారు. వాటితో రకరకాలైన ఆహారాలు తయారు చేసేవారు.

కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. ముఖ్యంగా ఏవి పడితే ఆ హారాలు తినేస్తున్నారు. ఉడికీ ఉడకని ఆహారం తినడం వల్ల.. సరిగ్గా జీర్ణం అయ్యేది కాదు. దీంతో కడుపులో నొప్పి, అజీర్తి, పొట్ట పట్టేయడం వంటి సమస్యలు తలెత్తేవి. జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండాలంటే.. వాము చాలా హెల్ప్ చేస్తుంది. వారం లేదా పది రోజులకు ఓ సారైనా వాముతో తయారు చేసే ఆహారాలు తినడం వల్ల జీర్ణ వ్యవస్థ అనేది శుభ్ర పడుతుంది. దీని వల్ల పొట్ట ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది. అందులోనూ చలి కాలంలో వాముతో రసం చేసుకుని తింటే చాలా ఆరోగ్యం. మరి వాము రసానికి కావాల్సిన పదార్థాలు ఏంటి? ఎలా తయారు చేస్తారో ఇప్పుడు చూద్దాం.

వాము రసానికి కావాల్సిన పదార్థాలు:

వాము, ఉల్లిపాయ, పచ్చి మిర్చి, చింత పండు, బెల్లం తురుము, ఉప్పు, కొత్తి మీర, కొత్తి మీర, ఆయిల్, పసుపు, ఆయిల్, తాళింపు దినుసులు.

వాము రసం తయారీ విధానం:

వాము రసం తయారు చేయడం చాలా సులభం. ఒక లోతైన పాత్ర తీసుకుని.. అందులో చింత పండు, ఉప్పు, పచ్చి మిర్చి ముక్కలు, ఉల్లి పాయ ముక్కలు, పసుపు వేసి ఒకసారి కలపాలి. ఈ గిన్నెను స్టవ్ పెట్టి.. మీడియం మంటపై ఓ 10 నిమిషాలు మరిగించాలి. తర్వాత కరివేపాకు, కొత్తి మీర, తురిమిన బెల్లం కూడా వేసి ఓ పొంగు రానివ్వాలి.

ఈ సమయంలోనే ఒక స్పూన్ వాము కూడా వేసి చిన్న మంట మీద ఓ ఐదు నిమిషాలు బాగా మరిగించాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి.. ఈ రసానికి పోపు పెట్టాలి. అంతే ఎంతో టేస్టీ అండ్ హెల్దీ వాము రసం తయారు. వేడి వేడి అన్నంలో ఈ వాము రసం వేసుకుని తింటే చాలా మంచింది. పిల్లలకు పెడితే వారిలో ఉండే నులి పురుగులు వంటివి నశిస్తాయి. జీర్ణ వ్యవస్థ కూడా మెరుగు పడుతుంది.