Vastu Tips: ఇంటి మెట్లే కుంటుంబ భవిష్యత్తుకు సోపానాలు.. వాస్తు శాస్త్రం చెబుతున్న ఆసక్తికర విషయాలు..

ఇంటి నిర్మాణానికి ఎంత ప్రాధాన్యం ఇస్తామో, పై అంతస్తులకు లేదా మేడ మీదకు వెళ్లడానికి నిర్మించే మెట్లకు కూడా అంతే ప్రాధాన్యం ఇవ్వాలని వాస్తు శాస్త్రం బోధిస్తోంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Join Now
Facebook Page Join Now

ఇల్లు కొనే ముందు అది తూర్పు దిశకు ఎదురుగా ఉందా లేక ఉత్తర దిశకు ఎదురుగా ఉందా అని చూడటం సర్వత్రా జరుగుతుంటుంది. అదేవిధంగా ఆ ఇంటికి మెట్లు ఏ విధంగా ఉన్నాయి, ఏ దిక్కున ఉన్నాయి అనేది కూడా చూసుకోవాల్సి ఉంటుందని విశ్వకర్మ అనే విశిష్ట ప్రామాణిక వాస్తు శాస్త్ర గ్రంథం చెబుతోంది. మెట్ల మార్గం మంచిగా ఉంటేనే.. కుటుంబ భవిష్యత్తు బాగుంటుందని.. మెట్లు భవిష్యత్తుగా సోపానాలు అంటూ పేర్కొంటోంది. ఇల్లు కట్టుకునేటప్పుడు ఎటువంటి పరిస్థితులలోనూ మెట్ల నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేయవద్దని ఆ గ్రంథం పదేపదే చెబుతోంది. ఇంటి నిర్మాణంలోని లోపాలకంటే ఆ ఇంటి మెట్ల నిర్మాణంలోని లోపాలే ఆ ఇంటి యజమానిని, అందులో నివసించే కుటుంబాన్ని అష్ట కష్టాలపాలు చేస్తుంటా యని ఆ గ్రంథం తెలిపింది. మెట్లను లోపభూయిష్టంగా నిర్మించినా, వాస్తుకు విరుద్ధంగా నిర్మించినా ఆ ఇంట దరిద్రం తాండవిస్తుందని, అనారోగ్యం, నిరుద్యోగం, రుణ బాధలు, శత్రుభాధలు పీడిస్తాయని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఇంటి ఆవరణలో సరైన చోట, సరైన విధంగా మెట్లు నిర్మిస్తే అవి ఆ ఇంటి వారి చక్కని భవిష్యత్తుకు సోపానాలు అవుతాయని వాస్తు గ్రంథాలు చెబుతున్నాయి.

ఇల్లు ఏ ఫేసింగ్ లో ఉన్నా మెట్లు మాత్రం ఇంటికి దగ్గరగా ఎక్కువగా కుడి వైపునే ఉండటం శ్రేయస్కరమని వాస్తు శాస్త్ర నిపుణులు అనుభవపూర్వకంగా చెబుతున్నారు. అయితే, విశ్వకర్మ గ్రంథం ప్రకారం, ఇంటి యజమాని సౌకర్యాన్ని బట్టి ఏ దిక్కులో మెట్టు నిర్మించినా పరవాలేదు. ఇంటి పక్కనే చిన్న గదులు నిర్మించి వాటి నుంచి మెట్లు నిర్మించడం కూడా మంచిది. ఇంటి ముందు మాత్రం మెట్టు నిర్మించకూడదు. మెట్ట నిర్మాణానికి కూడా లోతైన పునాది అవసరం. దేవాలయాల్లో అవుతే మెట్లను రాళ్లతో నిర్మిస్తుంటారు. ఇళ్లకు మాత్రం చెక్కలు, కర్రలు, సిమెంట్, లోహాలతో మెట్లు నిర్మించడం పరిపాటి. అయితే, ఇంటి మెట్లను చెక్కలతోనూ, సిమెంటుతోనో లేదా రాళ్లతోనూ నిర్మించుకోవడం మంచిదని, ఇనుప లోహంతో కట్టించుకునే పక్షంలో ఆ ఇంటికి దరిద్ర దేవతను ఆహ్వానించడమే అవుతుందని నిపుణులు చెబుతున్నారు.

Related News

మెట్లను ఏటవాలుగాను, వక్రంగాను, వర్తులాకారంగానూ, మిశ్రమంగాను నిర్మించడం జరుగుతుంది. వీటిల్లో ఏ విధంగా మెట్లు నిర్మించినా, వ్యక్తిగత సౌకర్యాన్ని బట్టి మంచిదే కానీ, ఏటవాలుగా కడితే ఆ ఇంట్లో ఎప్పుడూ శుభకార్యాలు జరుగుతుంటాయని వాస్తు నిపుణులు అనుభవపూర్వకంగా చెప్పారు. వక్రంగాను, వర్తులాకారంగా ను మెట్లను నిర్మించడం వల్ల ఇంట్లోని వారికి మెట్లు ఎక్కటం, దిగటం కొద్దిగా అసౌకర్యంగా ఉంటుంది. అయితే వీటివల్ల ఆ ఇంట్లోని వారికి తరచూ ఏదో ఒక ఇబ్బంది లేదా చికాకు ఎదురవుతుంటుంది. ఒక చెట్టుకు తీగ చుట్టుకున్నట్టు మెట్లను నిర్మించడాన్ని వక్ర సోపాన నిర్మాణం అంటారు. ఒక స్తంభం చుట్టూ నిర్మించినట్టు మెట్లను నిర్మించడాన్ని వర్తులాకార సోపాన నిర్మాణం అంటారు.

ఏటవాలు మెట్ల నిర్మాణానికి సంబంధించినంత వరకు కొంత దూరం నేరుగా మెట్లను నిర్మించి, మధ్యలో చతురస్రాకారంలో ఖాళీ లేదా వంపు ప్రదేశాన్ని నిర్మించి, ఆ తర్వాత మళ్లీ నేరుగా మెట్టు నిర్మించడం జరుగుతుంది. ఇటువంటి మెట్లు ఆ ఇంట్లో నివసించే కుటుంబానికి మానసిక ప్రశాంతతను ఇస్తుంది. సాధారణంగా ఇళ్లకు సరి సంఖ్యలో మెట్లు నిర్మించడం మంచిది. మెట్ల ఎత్తు 18 అడుగుల వరకు ఉండవచ్చు. మేడ మీదకు వెళ్లేటప్పుడు గానీ, పై అంతస్తులకు వెళ్లేటప్పుడు గానీ శరీరం అలసిపోని విధంగా, ఆయాసం రాకుండా ఉండే విధంగా విశాలమైన మెట్లు నిర్మించుకోవడం శ్రేయస్కరం. మెట్లకు రెండు వైపులా చిన్నపాటి గోడను నిర్మించడం మంచిది. లేదా పట్టుకోవడానికి వీలుగా చెక్కతో గాని, లోహంతో గాని రైలింగ్ నిర్మించడం వల్ల మెట్లు ఎక్కడానికి ఇబ్బంది ఉండదు. ఇంటిని, ఇంటి సింహద్వారాన్ని నిర్మించడానికి చూపించిన శ్రద్ధను మెట్లు నిర్మాణానికి కూడా చూపించడం ఆ ఇంటి యజమానికి, ఆ ఇంట్లో నివసించే కుటుంబానికి శ్రేయస్కరమని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

Related News