రోడ్డు ప్రమాదంలో వేద విద్యార్దులు మృతి..రంగంలోకి జగన్

రోడ్డు ప్రమాదంలో వేద విద్యార్దులు మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే… రోడ్డు ప్రమాదంలో వేద విద్యార్దులు మృతిపై మాజీ సీఎం వైయస్‌.జగన్ మోహన్‌ రెడ్డి దిగ్ఫ్రాంతి వ్యక్తం చేశారు.


మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు మాజీ సీఎం వైయస్‌.జగన్ మోహన్‌ రెడ్డి. కర్ణాటకలోని సింధనూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో డ్రైవర్ తో పాటు ముగ్గురు వేద విద్యార్ధులు మరణించడంపై మాజీ సీఎం శ్రీ వైయస్.జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని, మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కర్నూలు జిల్లా మంత్రాలయం నుంచి కర్ణాటకలోని హంపీ ఆరాధన కార్యక్రమాలకు వెళ్తుండగా…వాహనం బోల్తా పడిన ఘటనలో ముగ్గురు వేదపాఠశాల విద్యార్ధులు, డ్రైవర్ చనిపోయిన ఘటన అత్యంత బాధాకరం. ఈ ఘటన తీవ్ర దిగ్భాంత్రికి గురి చేసింది. .చనిపోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాను. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలబడాలని కోరుతున్నాను.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.