Vehicle RC: వాహన రుణం చెల్లించిన తర్వాత కొత్త RC కోసం RTO కార్యాలయానికి వెళ్లవలసిన అవసరం లేదు ఎందుకంటే

చాలా మంది లోన్ మీద కార్లు కొంటారు. తమ రుణాన్ని గడువుకు ముందే తిరిగి చెల్లిస్తారు. దీని తరువాత వారు బ్యాంకు నుండి NOC (నో అబ్జెక్షన్ సర్టిఫికేట్) కూడా పొందుతారు.


అయితే, NOC పొందడం కస్టమర్‌తో పాటు బ్యాంకు కూడా సంతోషాన్నిస్తుంది. రుణం తిరిగి చెల్లించడం ద్వారా తమపై భారీ భారం తొలగిపోయిందని వినియోగదారులు భావిస్తున్నారు. కానీ బ్యాంకు నుండి NOC పొందడం వల్ల మీరు పూర్తిగా స్వేచ్ఛగా లేరని కస్టమర్లు తెలుసుకోవాలి.

అయితే, మీ క్రెడిట్ స్కోర్‌పై ఎటువంటి ప్రభావం ఉండదు. భవిష్యత్తులో రుణం తీసుకోవడంలో మీకు ఎలాంటి సమస్య ఉండదు.

భవిష్యత్తులో ఉన్న వాహనాన్ని అమ్మడంలో మాత్రమే సమస్య ఉంటుంది. అంటే, మీరు కారును రుణం మీద కొనుగోలు చేసి, బ్యాంకు రుణాన్ని కూడా తిరిగి చెల్లించారు.

కానీ తర్వాత దానిని అమ్మడంలో మీరు చాలా సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఎందుకంటే వాహనం RC పై హైపోథికేషన్ సీల్ ఇప్పటికీ ఉంది. అందుకే RCపై ఉన్న హైపోథెకేషన్ సీల్‌ను తీసివేయడం అవసరం.

హైపోథెకేషన్ సీల్‌ అంటే ఏమిటి?

రుణం పొందడానికి ఒక ఆస్తిని పూచీకత్తుగా తాకట్టు పెట్టినప్పుడు హైపోథెకేషన్ జరుగుతుంది.

అంటే రుణం పొందేటప్పుడు మీ వాహనం ఆర్‌సీ బ్యాంకు వద్ద ఉంటుంది. అంటే మీరు సరైన సమయంలో రుణం తీర్చకుంటే ఆ ఆర్సీ ద్వారా మీ వాహనంపై పూర్తి హక్కులు ఉంటాయి.

అయితే, ఒప్పందం నిబంధనలు నెరవేరకపోతే రుణదాత ఆస్తిని స్వాధీనం చేసుకోవచ్చు. హైపోథెకేషన్ తనఖా, తాత్కాలిక హక్కు లేదా అసైన్‌మెంట్ నుండి భిన్నంగా ఉంటుంది.

రుణం తిరిగి చెల్లించని పక్షంలో రుణం ఇచ్చిన దాత దానిపై పూర్తి హక్కులు ఉంటాయని గుర్తించుకోండి. దీనినే హైపోథెకేషన్ సీల్‌ అంటారు.

RTOని సందర్శించాల్సిన అవసరం లేదు:

చాలా మంది ఆర్‌సీ సంబంధిత పనిని పూర్తి చేయడానికి RTOని సందర్శించాల్సి ఉంటుందని భావిస్తారు. కానీ హైపోథెకేషన్‌కు సంబంధించిన పనిని పూర్తి చేయడానికి మీరు RTO కార్యాలయానికి వెళ్లవలసిన అవసరం లేదని కస్టమర్లు తెలుసుకోవాలి. దీని కోసం మీరు ఇంట్లో కూర్చొని ఆర్‌సీ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కొన్ని రోజుల్లో ఆర్‌సీ మీ ఇంటికి వస్తుంది.

ఆర్‌సీ కోసం ఆన్‌లైన్‌లో ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

  1. మీరు మీ రాష్ట్ర రవాణా శాఖ వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
  2. దీని తర్వాత మీరు ఆన్‌లైన్ సర్వీస్, చెల్లింపుపై క్లిక్ చేయండి.
  3. తర్వాత రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, పర్మిట్ సంబంధితపై క్లిక్ చేయండి.
  4. ఇప్పుడు వాహన్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ పై క్లిక్ చేయండి.
  5. మీ మొదటి లాగిన్‌లో మీరు E-KYC ప్రక్రియను పూర్తి చేయాలి.
  6. ఇక్కడ మీరు EKYC ఉపయోగించి హైపోథికేషన్ రద్దు, ఫారం 35, NOCని ప్రామాణీకరించే ఎంపికను పొందుతారు.
  7. ఇక్కడ అన్ని వివరాలను పూరించి, రుసుము చెల్లించండి.
  8. ఇప్పుడు, మీరు NOC, వాహన బీమా, PUC సర్టిఫికేట్, ID ప్రూఫ్ కాపీతో పాటు ఫారం 35ని RTO కార్యాలయానికి కొరియర్ చేయాలి.
  9. RTO కార్యాలయం మీ దరఖాస్తును తనిఖీ చేస్తుంది. అలాగే ప్రతిదీ సరిగ్గా ఉంటే కొత్త RC మీ ఇంటికి డెలివరీ అవుతుంది.