Vehicle Scratch Remove: కారు, బైక్, స్కూటర్‌కు గీతలు పడ్డాయా? రూ.10తో స్క్రాచెస్‌ తొలగించుకోండిలా!

మీకు కార్ ఉందా…


లేదంటే బైక్, స్కూటర్ వంటివి కలిగి ఉన్నారా? అయితే కచ్చితంగా మీ టూవీలర్ లేదా కారుపై స్క్రాచెస్ పడే ఉంటాయి. కింద పడ్డప్పుడు లేదంటే దేనికైనా తగిలించినప్పుడు వెహికల్‌పై స్క్రాచెస్ అనేవి పడుతూ ఉంటాయి.

లేదంటే కొంత మంది ఎవ్వరూ చూడనప్పుడు కావాలనే వెహికల్‌పై స్క్రాచెస్ వేస్తూ ఉంటారు. ఇలా కారణం ఏదైనా, కారు లేదా టూవీలర్లపై స్క్రాచెస్ అనేవి పడుతూ ఉంటాయి. దీని వల్ల మనకు కూడా బాధ అనిపిస్తుంది.

గీతలు పడటం వల్ల కారు లేదా టూవీలర్ చూడటానికి బాగుండకపోవచ్చు. మన చూపు కూడా పదే పదే ఆ స్క్రాచెస్ వైపే వెళ్తుంది. మీరు స్క్రాచెస్ పడిన పార్ట్‌కు కొత్తది కొనాలంటే అధిక డబ్బులు ఖర్చు అవుతాయి.

ఇలా కాకుండా వెహికల్ స్క్రాచెస్‌ను సులభంగానే ఇంటి వద్ద నుంచే తొలగించుకునే ఆప్షన్ ఒకటి అందుబాటులో ఉంది. యూట్యూబ్‌లో చాలా వీడియోల్లో స్క్రాచెస్ ఎలా తొలగించుకోవచ్చు అనే విషయాన్ని తెలియజేస్తూ ఉంటారు.

ఇలాంటి టిప్స్‌లో టూత్‌పేస్ట్ కూడా ఒకటి ఉంది. మీరు కేవలం రూ. 10 ఖర్చుతో టూత్ పేస్ట్ ద్వారా వెహికల్ స్క్రాచెస్‌ను తొలగించుకోవచ్చు. అయితే స్క్రాచెస్ ఏ స్థాయిలో ఉన్నాయనే అంశం ప్రాతిపదికన టూత్ పేస్ట్ ఎంత కావాలనే అంశం ఆధారపడి ఉంటుంది.

మీరు మీ కారుపై ఉన్న స్క్రాచెస్‌ను తొలగించుకోవడానికి షోరూమ్‌కు లేదంటే ప్రొఫెషనల్ వద్దకు వెలితే చిన్న స్క్రాచెస్‌కు కూడా మీకు రూ. 5 వేల వరకు ఖర్చు అవుతుంది. అదే స్క్రాచెస్ ఎక్కువగా ఉంటే మాత్రం ఇంకా ఎక్కువ డబ్బులు చెల్లించుకోవాలి.

అయితే మీరు ఇలాంటివి ఏమీ లేకుండా ఇంటి వద్ద నుంచే తక్కువ ఖర్చుతో స్క్రాచెస్ తొలగించుకోవచ్చు. అయితే ఇక్కడ మీరు ఒక విషయాన్ని గుర్తించుకోవాలి. పూర్తిగా స్క్రాచెస్ వెళ్లిపోతాయని అనుకోవద్దు. ఉన్న స్క్రాచెస్ కనిపించడం మాత్రం కొంత మేర తగ్గుతుంది.

అలాగే మరో విషయాన్ని కూడా గుర్తించుకోవాలి. కారుకు డెంట్ పడితే దాన్నితొలగించడం కష్టమే. ఎందుకంటే ఆ ప్లేస్‌లో కలర్ పూర్తిగా పోయి ఉంటుంది. అప్పుడు ఆ స్క్రాచెస్ అలానే ఉంటాయి. కలర్ పైన ఏమైనా స్క్రాచెస్ ఉంటే.. వాటిని కొంత మేర తగ్గించుకోవచ్చు.

మీరు కోల్గేట్ లేదా ఇతర టూత్ పేస్ట్‌ను తీసుకొని దాన్ని స్క్రాచెస్‌పై రుద్దాలి. టూత్‌పేస్ట్‌లో కాల్షియం కార్బొనేట్ ఉంటుంది. ఇది మరకాలను శుభ్రం చేస్తుంది. కారు స్క్రాచెస్‌పై టూత్ పేస్ట్‌తో 2 నుంచి 3 నిమిషాలు రుద్దాలి. తర్వాత క్లాత్‌తో దీన్ని శుభ్రం చేయాలి. స్క్రాచెస్ క్లీన్ అవుతాయి. లేదంటే కొంత మేర స్క్రాచెస్ తగ్గుతాయి.

కచ్చితంగా స్క్రాచెస్ పోతాయని అనుకోవద్దు. ఇలా చేయడం ద్వారా కొంత మేర స్క్రాచెస్ కనిపించడం తగ్గొచ్చు. టూత్ పేస్ట్ మాత్రమే కాకుండా వ్యాక్స్, లెన్స్ క్లీనర్, ఎరేజర్,స్క్రాచ్ రిమూవర్ వంటి వాటి ద్వారా కూడా మీరు స్క్రాచెస్‌ను కొంత మేర తొలగించుకోవచ్చు. వీటి ద్వారా హెడ్ లైట్స్‌ను శుభ్రం చేసుకోవచ్చు.