Gold Rate: దేశంలోనే బంగారం అతి తక్కువ ధరకు ఎక్కడ లభిస్తుందో తెలుసా.. తులం బంగారంపై ఎంత తగ్గిస్తారు..

Share Social Media

బంగారం ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలోనే నగరంలో బంగారం తక్కువ ధరకు లభిస్తుందో తెలుసుకుందాం. తద్వారా మీరు పెద్ద మొత్తంలో నగలు కొనాలని ప్లాన్ చేస్తుంటే మాత్రం ఇది మీకు బెటర్ చాయిస్ గా నిలుస్తుంది.
బంగారం కొనాలని ప్లాన్ చేస్తున్నారా.. అయితే చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే బంగారం ధర భారీగా పెరిగిపోయింది. ప్రస్తుతం పసిడి ధర 10 గ్రాములకు గాను 60 వేల రూపాయలు దాటింది. ఇది చరిత్రలోనే గరిష్ట స్థాయి. ఒక గ్రాము కొనుగోలు చేయాలన్నా కూడా దాదాపు 6000 పైన ఖర్చు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మీరు బంగారు నగలను కొనుగోలు చేసే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే భారీగా నష్టపోయే ప్రమాదం ఉంది. మీరు కొనుగోలు చేసే షాపు విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. లేకపోతే ఒక్క గ్రాము తేడా వచ్చినా మీరు సుమారు 6000 రూపాయల వరకు నష్టపోవాల్సిన పరిస్థితి ఉంది.

హైదరాబాద్ నగరంలో బంగారం ధరలు ఇతర నగరాలతో పోల్చితే కొద్దిగా స్వల్పంగా తక్కువగానే ఉన్నాయి. అయితే మన దేశంలో ఏ రాష్ట్రంలో తక్కువ ధరకు బంగారం లభిస్తుందని ఆలోచిస్తున్నారా అందుకు తక్కువ నా సమాధానం మీకు లభిస్తుంది. కేరళ రాష్ట్రంలో అతి తక్కువ ధరకే బంగారం లభిస్తుంది. దేశంలోనే అత్యధికంగా బంగారం వినియోగం ఉన్న రాష్ట్రం కేరళ. ఆ తర్వాత తమిళనాడు రాష్ట్రంలో అత్యధికంగా బంగారాన్ని వినియోగిస్తారు. కేరళలోని మలబారు అలాగే తిరువనంతపురం వంటి జిల్లాల్లో బంగారం దుకాణాలు అత్యధికంగా ఉంటాయి.

ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్స్ అయిన మలబార్ గోల్డ్, జాయ్ అలుకాస్, బీమాస్ గోల్డ్ లాంటి నగల నగల దుకాణాలు కేరళ కేంద్రంగానే దేశ వ్యాప్తంగా బ్రాంచీలను వ్యాపారాలను కొనసాగిస్తున్నాయి. కేరళ రాష్ట్రానికి బంగారంతో అవినావభావ సంబంధం ఉంది. ప్రాచీన కాలం నుంచి కూడా కేరళ రాష్ట్రం విదేశాలతో వాణిజ్య సంబంధాలను కలిగి ఉంది. ముఖ్యంగా గల్ఫ్ దేశాలు అలాగే ఆఫ్రికా ఖండంతో కూడా వాణిజ్య సంబంధాలను కేరళ రాష్ట్రం కలిగి ఉంది. పోర్చుగీసు పాలకులు సైతం బంగారం వర్తకాన్ని ప్రోత్సహించారు.

Related News

కేరళలోని మలబారు ప్రాంతం బంగారం డిజైన్లకు పెట్టింది పేరు. అలాగే నాణ్యమైన బంగారం కొనుగోలు చేయాలన్నా కూడా మలబారు ప్రాంతాన్ని ఎంపిక చేసుకుంటారు. మీరు పెద్ద మొత్తంలో బంగారం కొనుగోలు చేయాలనుకుంటే, కేరళలోని మలబారు ప్రాంతానికి వెళ్లి బంగారం షాపింగ్ చేయవచ్చు. తద్వారా మీకు నాణ్యమైన బంగారం లభిస్తుంది. అలాగే అరుదైన డిజైన్స్ కూడా ఇక్కడ లభిస్తాయి. కేరళలోని పలు నగల దుకాణాల్లో తక్కువ ధరకే బంగారం కొనుగోలు చేయవచ్చు. బయట మార్కెట్ ధరల కన్నా బంగారం 5 శాతం తక్కువగా లభిస్తుంది.

కేరళ రాష్ట్రం తర్వాత తమిళనాడులో కూడా బంగారం వినియోగ అత్యధికంగా ఉంటుంది. చెన్నై కేంద్రంగా అనేక బంగారం నగల దుకాణాలు దేశవ్యాప్తంగా ఫేమస్ అవుతున్నాయి. లలిత జ్యువెలర్స్, ఖజానా సహా పలు అనేక దుకాణాలు అంతర్జాతీయ స్థాయి బ్రాండ్లను అందుకున్నాయి.

బంగారం నగలను కొనుగోలు చేయాలంటే ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే నెల్లూరు ప్రొద్దుటూరు మార్కెట్లో దేశంలోనే ప్రసిద్ధి చెందాయి అని చెప్పవచ్చు. ఈ రెండు ప్రాంతాల్లో కూడా బంగారం మిగతా ప్రాంతాలతో పోల్చితే నాణ్యతతోనూ, ధరకు తగ్గట్టుగా లభిస్తుంది. అందుకే మీరు పెద్ద మొత్తంలో బంగారు నగలను కొనుగోలు చేయాలంటే ఈ ప్రాంతాల్లో కొనుగోలు చేస్తే మీ పెట్టుబడికి తగిన విలువ లభిస్తుంది

Related News