టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ కారు ప్రమాదానికి గురైంది. జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి సమీపంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదం నుంచి విజయ్ సురక్షితంగా బయటపడినట్లు తెలుస్తోంది.
అయితే ఈ ఘటనలో కారు స్వల్పంగా దెబ్బతిన్నట్లు సమాచారం. విజయ్ దేవరకొండ ప్రయాణిస్తున్న కారును.. బొలెరో వాహనం ఢీకొట్టడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. దీంతో విజయ్ మరో కారులో హైదరాబాద్‌కు ప్రయాణమయ్యారు.
కాగా.. ఇటీవల రష్మికతో ఎంగేజ్‌మెంట్ జరిగినట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. నిశ్చితార్థం తర్వాత విజయ్ దేవరకొండ పుట్టిపర్తిలోని సత్యసాయి సమాధిని దర్శించుకునేందుకు వెళ్లారు. తన స్నేహితులతో కలిసి తిరిగి హైదరాబాద్ వస్తున్న క్రమంలోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
































