నేటి నుంచి విశాఖ ఉత్సవ్.. 8 రోజులు వేడుకలు

నేటి నుంచి జనవరి 31 వరకూ విశాఖ ఆర్కే బీచ్‌లో విశాఖ ఉత్సవం జరగబోతోంది. ప్రధానంగా ఆర్‌కే బీచ్‌లోని కాళీమాత గుడి ఎదురుగా ఈ వేడుకలు ఉంటాయి. రోజుకో రకం వేడుకలు నిర్వహిస్తారు.


ఈసారి స్పోర్ట్స్, గేమ్స్ కూడా ఉంటాయి. స్థానిక కళాకారుల కోసం నోవాటెల్‌ హోటల్‌ ఎదురుగా ఒక వేదికను సిద్ధం చేశారు. ఇవాళ గాయని సునీత.. సినిమా సాంగ్స్ పాడి అలరిస్తారు. రోజూ సాయంత్రం 5 నుంచి రాత్రి 10 వరకూ కార్యక్రమాలు ఉంటాయి. 70 ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఈ ఉత్సవాల కోసం ఆర్టీసీ.. రోజూ వివిధ ప్రాంతాల నుంచి 14 ప్రత్యేక సర్వీసులు నడపనుంది. ఇవి రోజూ మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 11 వరకు ఉంటాయి.

నేడు 18వ రోజ్ గార్ మేళా జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా 61వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు వర్చువల్‌గా ఇస్తారు. విశాఖలో నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ఉంటుంది. సాయంత్రం చిత్తూరు లోని నగరి పర్యటనకు సీఎం చంద్రబాబు వెళ్తున్నారు. వేస్ట్ మేనేజ్‌మెంట్‌పై విద్యార్థులతో చిట్ చాట్ ఉంటుంది. ఇవాళ జాతీయ బాలికా దినోత్సవం. అలాగే అంతర్జాతీయ విద్యా దినోత్సవం. ఇలా ఏవి జరిగితే వాటినీ, రోజువారీ అప్‌డేట్స్ అన్నీ ఇక్కడ మనం తెలుసుకుందాం. ఏపీలో ఏం జరుగుతుంది? తెలంగాణ పరిస్థితేంటి? ఇండియా, ఇంటర్నేషనల్‌గా ఏం జరుగుతోందో ఎప్పటికప్పుడు తెలుసుకుందాం. న్యూస్ బ్రేకింగ్స్, అప్‌డేట్స్ అన్నీ ఇక్కడ మనం.. మినిట్ టు మినిట్ చూద్దాం.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.