రూ.14 వేలకే 7 ప్రముఖ పుణ్యక్షేత్రాల దర్శనం… అరుణాచలం

పుణ్యక్షేత్రాల యాత్రకు వెళ్లాలనుకునే భక్తులకు ఐఆర్‌సీటీసీ టూరిజం మంచి శుభవార్త చెప్పింది. హైదరాబాద్ నుంచి ప్రత్యేక టూర్ ప్యాకేజీ ఆపరేట్ చేస్తోంది.
ఈ టూర్ ప్యాకేజీ బుక్ చేసుకున్న పర్యాటకులు ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా ఏడు ప్రముఖ పుణ్యక్షేత్రాలను దర్శించుకోవచ్చు. తిరువన్నామలైలోని అరుణాచలేశ్వర ఆలయం, రామేశ్వరంలోని రామనాథస్వామి ఆలయం, మదురైలోని మీనాక్షి అమ్మవారి ఆలయం, కన్యాకుమారిలో రాక్ మెమొరియల్, కుమారి అమ్మన్ ఆలయం, త్రివేండ్రంలో శ్రీ పద్మనాభస్వామి ఆలయం, తిరుచ్చిలో శ్రీ రంగనాథస్వామి ఆలయం, తంజావూరులో బృహదీశ్వర ఆలయం చూడొచ్చు. దివ్య దక్షిణ్ యాత్ర విత్ జ్యోతిర్లింగ పేరుతో ఈ టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంది. ఇది 8 రోజులు, 7 రాత్రుల టూర్ ప్యాకేజీ. ఫిబ్రవరి 21న టూర్ ప్రారంభం అవుతుంది. భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలులో యాత్ర కొనసాగుతుంది. రైలులో మొత్తం 705 బెర్తులు ఉంటాయి. ఇందులో స్లీపర్ 237, థర్డ్ ఏసీ 416, సెకండ్ ఏసీ 52 బెర్తులు ఉంటాయి.


మొదటి రోజు మధ్యాహ్నం 12 గంటలకు సికింద్రాబాద్‌లో ట్రైన్ బయల్దేరుతుంది. ఈ టూర్ ప్యాకేజీ బుక్ చేసుకున్న పర్యాటకులు జనగాం, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, మధిర, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట రైల్వే స్టేషన్లలో టూరిస్ట్ రైలు ఎక్కొచ్చు. రెండో రోజు ఉదయం తిరువన్నామలై రైల్వే స్టేషన్ చేరుకుంటారు. ఫ్రెషప్ అయిన తర్వాత అరుణాచల ఆలయంలో దర్శనం ఉంటుంది. సాయంత్రం తిరువన్నామలై నుంచి రామేశ్వరం రైలులో బయల్దేరాలి.మూడో రోజు ఉదయం కుడల్‌నగర్ రైల్వే స్టేషన్ చేరుకుంటారు. అక్కడ్నుంచి రామేశ్వరం రోడ్డు మార్గంలో వెళ్లాలి. హోటల్‌లో చెకిన్ అయిన తర్వాత రామేశ్వరంలో స్థానిక ఆలయాలు చూడొచ్చు. రాత్రికి రామేశ్వరంలో బస చేయాలి.

నాలుగో రోజు రామేశ్వరం నుంచి మదురై బయల్దేరాలి. సాయంత్రం మీనాక్షి అమ్మవారి ఆలయ దర్శనం ఉంటుంది. ఆ తర్వాత కన్యాకుమారి బయల్దేరాలి. ఐదో రోజు ఉదయం కన్యాకుమారి చేరుకుంటారు. రాక్ మెమొరియల్, గాంధీ మండప్, సన్‌సెట్ పాయింట్ చూడొచ్చు. రాత్రికి కన్యాకుమారిలో బస చేయాలి. ఆరో రోజు కన్యాకుమారి నుంచి త్రివేండ్రం బయల్దేరాలి. తిరువనంతపురం నుంచి శ్రీ పద్మనాభస్వామి ఆలయానికి తీసుకెళ్తారు. కోవల్ బీచ్ కూడా చూడొచ్చు. ఏడో రోజు శ్రీరంగం ఆలయం చూడొచ్చు. లంచ్ తర్వాత తంజావూర్ బయల్దేరాలి.అక్కడ బృహదీశ్వర ఆలయం చూడొచ్చు. అక్కడి నుంచి తిరుగు ప్రయాణం మొదలవుతుంది. తంజావూరు రైల్వే స్టేషన్‌లో రైలు ఎక్కితే ఎనిమిదో రోజు మీ గమ్యస్థానానికి చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.
ఐఆర్‌సీటీసీ దివ్య దక్షిణ యాత్ర టూర్ ప్యాకేజీ ధర చూస్తే ఎకానమీ ప్యాకేజీ ధర రూ.14,700, స్టాండర్డ్ ధర రూ.22,300, కంఫర్ట్ ప్యాకేజీ ధర రూ.28,700. భారత్ గౌరవ్ ట్రైన్ స్కీమ్ ద్వారా రైల్ టూరిజంను ప్రోత్సహించేందుకు భారతీయ రైల్వే 33 శాతం కన్సెషన్ ఇస్తోంది. టూర్ ప్యాకేజీలో ఎకానమీలో స్లీపర్ క్లాస్ ప్రయాణం, నాన్ ఏసీ గదుల్లో బస, స్టాండర్డ్‌లో థర్డ్ ఏసీ ప్రయాణం, కంఫర్ట్‌లో సెకండ్ ఏసీ ప్రయాణం, ఏసీ గదుల్లో బస, వాహనాల్లో సైట్ సీయింగ్ కవర్ అవుతాయి. ఉదయం టీ, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ ప్యాకేజీలో కవర్ అవుతాయి. శాకాహార భోజనం మాత్రమే అందిస్తారు. పర్యాటకులకు ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కూడా లభిస్తుంది. ఎంట్రీ ఛార్జీలు, బోటింగ్, అడ్వెంచర్ స్పోర్ట్స్, రూమ్ సర్వీస్ లాంటి ఇతర ఛార్జీలు ఏవీ ఇందులో కవర్ కావు.
👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.