పేదలకు సొంతిల్లు కల నిజం చేసేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ఇళ్ల కోసం భారీగా దరఖాస్తులు అందుతున్నాయి.
ఇదే సమయం లో ఈ నెలాఖరు దరఖాస్తులకు చివరి తేదీగా ఖరారు చేసారు. పేదల ఇళ్ల నిర్మాణాన్ని ప్రభుత్వం రెండు విధాలుగా చేపడుతోంది. దీనికి సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ పథకాన్ని ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోంది.
ఏపీలో పేదలకు సొంతింటి కోసం పెద్ద సంఖ్యలో లబ్దిదారులు దరఖాస్తు చేస్తున్నారు. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయక్తంగా అమలు చేస్తున్న పీఎంఏవై- ఎన్టీఆర్ పథకానికి 3 లక్షల 47 వేల దరఖాస్తులు అందాయి. స్థలం ఉన్నవారికి ఇంటి నిర్మాణానికి నిధులు, స్థలం లేనివారికి 3 సెంట్లు ఇచ్చి ఆర్థిక సాయం చేసేలా రెండు విధాలుగా ప్రభుత్వం పథకాన్ని అమలు చేస్తోంది. అయితే, గ్రామీణ ప్రాంతంలో లబ్దిదారులు దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 30తో గడువు ముగియనుంది. ఇందుకు అర్హులను గుర్తించేందుకు ప్రత్యేక యాప్‌ను తీసుకొచ్చి ఎంపిక చేప ట్టాయి. గతంలో పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకాన్ని అమ లు చేయగా కేవలం ఇళ్ల నిర్మాణాల మంజూరు కోసమే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామీణ ప్రాంతా లను యూడీఏలుగా మారుస్తున్నాయనే ఆలోచనతో కేంద్రం వీటిల్లో అనుమతిని నిలిపేసింది.
తాజాగా యూడీఏల్లో కూడా గ్రామీణ పథకాన్ని అమలు చేస్తున్నారు. వీటి పరిధిలోనూ అర్హుల ఎంపికను చేపడుతున్నారు. పేదల ఇళ్ల నిర్మాణాన్ని ప్రభుత్వం రెండు విధాలుగా చేపడుతోంది. సొంత స్థలం ఉండి అక్కడే నిర్మాణం చేపడతామనే వారికి ఇంటిని మంజూరు చేయనుంది. స్థలం లేకపోతే గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లను కేటాయించి అక్కడ నిర్మాణం చేపట్టేందుకు ఇల్లును మంజూరు చేస్తుంది. సొంత స్థలమున్న, స్థలం లేని వారి వివరాలను అధికారులు సేకరించే పని వేగవంతం చేసారు. రాష్ట్రంలో అర్హులను గుర్తించే బాధ్యతను గ్రామ, వార్డు సచివాలయాల పరిధి లోని ఇంజినీరింగ్ అసిస్టెంట్లు, గృహ నిర్మాణ శాఖ ఏఈలకు ప్రభుత్వం అప్పగించింది. వీరు ఇంటింటికీ వెళ్లి అర్హుల్ని గుర్తించాలి. దరఖాస్తుదారు ప్రస్తుతం నివాసం ఉంటున్న ఇంటి తో పాటుగా లొకేషన్ ఫొటోలు యాప్‌లో అప్‌లోడ్ చేస్తారు. యాప్‌లో నమోదైన వివరాల ఆధారంగా అర్హుల జాబితా సిద్ధం కానుంది. ఒంటరి మహిళలు, వితంతువులకు ప్రాధాన్యమిస్తున్నారు.
































