మీ ఇంట్లో కిరాణా ఖర్చులను తగ్గించుకోవాలనుకుంటున్నారా..? ఈ క్రెడిట్ కార్డులతో డబ్బులు ఆదా

మన ఇంట్లో కిరాణా ఖర్చుల కోసం వేలు ఖర్చు పెడుతూ ఉంటాం. ఇక ఫ్యామిలీ, పిల్లలు ఉంటే ఖర్చు మరింత పెరుగుతూ ఉంటుంది. పండుగ సమయంలో కిరాణా ఖర్చుల కోసం మరింత వెచ్చించాల్సి ఉంటుంది. కొన్ని క్రెడిట్ కార్డులు కిరాణా సరుకుల కొనుగోలుపై ఆఫర్లు ఇస్తున్నాయి.

క్రెడిట్ కార్డు ఉంటే చాలు.. డబ్బులకు ఇక ఇబ్బంది లేదు అని విచ్చలవిడిగా ఎక్కడబడితే అక్కడ ఖర్చు పెడుతూ ఉంటారు. ఇక బిల్లు కట్టాల్సి వచ్చినప్పుడు అవవసరంగా ఎక్కువ ఖర్చు పెట్టామంటూ లబోదిబోమంటారు. అయితే క్రెడిట్ కార్డులను సక్రమంగా వాడటం వల్ల డబ్బులు చాలా ఆదా అవుతాయి. రోజువారీ జీవితంలో మన ఇంట్లో నిత్యావసర సరుకులు, ఇంట్లోకి కావాల్సిన సామాన్లు, వస్తువుల కోసం డబ్బులు ఎక్కువగా ఖర్చు అవుతూ ఉంటాయి. క్రెడిట్ కార్డు ఉండటం ద్వారా ఈ ఖర్చులను తగ్గించుకుని డబ్బులు ఆదా చేసుకోవచ్చు. అదెలా అంటే..?


క్రెడిట్ కార్డుపై డిస్కౌంట్లు

చాలా సూపర్ మార్కెట్లు క్రెడిట్ కార్డులపై అనేక ఆఫర్లు ఇస్తున్నాయి. క్రెడిట్ కార్డు ద్వారా కొంటే పేమెంట్‌పై డిస్కౌంట్‌తో పాటు క్యాష్ బ్యాక్ ఆఫర్లు అందిస్తున్నాయి. ఆన్‌లైన్‌లో ఫ్లిఫ్‌కార్ట్, అమెజాన్, బిగ్ బాస్కెట్, జెప్టో, బ్లింకిట్ లాంటి ఫ్లాట్‌ఫామ్స్‌ క్రెడిట్ కార్డులు ద్వారా ట్రాన్సక్షన్స్ చేస్తే క్యాష్ బ్యాక్, డిస్కౌంట్ ఆఫర్లు ఇస్తున్నాయి. ఇక ఆఫ్‌లైన్‌లో కూడా పేరున్న సూపర్ మార్కెట్లు ఇలాంటి ఆఫర్లను కస్టమర్లను ఆకర్షించేందుకు అమలు చేస్తున్నాయి. దాదాపు 5 శాతం క్యాష్ బ్యాక్‌ ఇస్తున్నాయి. ఇంట్లోకి అవసరమయ్యే సరుకులు క్రెడిట్ కార్డు ద్వారా కొనడం వల్ల లాభం ఉంటుంది.

రివార్డ్ పాయింట్లు, వోచర్లు

కొన్ని క్రెడిట్ కార్డులు కిరాణా సరుకుల కొనుగోలుపై రివార్డ్ పాయింట్లు ఇస్తున్నాయి. ఈ రివార్డ్ పాయింట్లను రిడీమ్ చేసుకుని కొన్ని సూపర్ మార్కెట్లు వోచర్లు ఇస్తాయి. కిరాణా ఖర్చుల కోసం ఈ వోచర్లు ఉపయోగించుకోవచ్చు. కొన్ని బ్యాంకులు ఈ రివార్డు పాయింట్లను డబ్బు రూపంలో కూడా వాడుకునే అవకాశం కల్పిస్తున్నాయి. కొన్ని క్రెడిట్ కార్డులు గిఫ్డ్ కార్డులు అందుబాటులోకి తెచ్చాయి. 5 నుంచి 10 శాతం తగ్గింపుతో గిఫ్ట్ కార్డులు ఇస్తున్నాయి. వీటిని మీరు కొనుగోలు చేసి ఆన్ లైన్ లేదా సూపర్ మార్కెట్లలో ఉపయోగించుకోవచ్చు.

బెస్ట్ క్రెడిట్ కార్డ్స్

ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు, HDFC Solitaire క్రెడిట్ కార్డు, SimplySAVE SBI కార్డు, SBI Card PRIME, అమెజాన్‌ పే-ఐసీఐసీఐ క్రెడిట్‌ కార్డు, హెచ్‌డీఎఫ్‌సీ మిలీనియా క్రెడిట్‌ కార్డు వంటివి కిరాణా సరుకులపై మంచి ఆఫర్లు, డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్‌లు ఇస్తున్నాయి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.