వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సర్వీస్ మేటర్, సర్వీస్ రిజిస్టర్లు, వారి సీనియారిటీ లిస్టు తయారు చేయాలని.. ఆర్‌డీఎంఏ అధికారులు, మున్సిపల్ కమిషనర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి.
తయారు చేసిన తరువాత సర్వీస్ రిజిస్టర్‌లను నిర్వహించడం, జిల్లా స్థాయిలో సంబంధిత కేడర్‌ల పదోన్నతల కోసం సీనియారిటీ జాబితాలను ప్రచురించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. తుది సీనియారిటీ జాబితా కాపీని రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ అండ్ డైరెక్టర్ కార్యాలయానికి తప్పకుండా పంపాలని సూచించింది.
38 వేల మంది..
రాష్ట్రంలో 3,842 వార్డు సచివాలయాల్లో దాదాపు 38 వేల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. ఇప్పటికే వార్డు సచివాలయాలను జనాభా ప్రాతిపదికన ఉద్యోగులను మూడు కేటగిరీలుగా విభజిస్తూ.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి అనుగుణంగా సిబ్బంది రేషనలైజేషన్ చేపట్టేందుకు చర్యలకు ఉపక్రమించింది. మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీస్, ఆస్పిరేషనల్ ఫంక్షనరీలుగా విభజించింది.
ఉద్యోగుల విభజన..
2,500 మంది జనాభా ఉన్న సచివాలయాలను ఏ కేటగిరీగా, 2,501 నుంచి 3,500 వరకు జనాభా ఉంటే బీ కేటగిరీగా, 3,501 కంటే ఎక్కువగా జనాభా ఉంటే సీ కేటగిరీగా విభజించారు. 2,500 మంది జనాభా ఉన్న సచివాలయానికి (ఏ కేటగిరీ) ఆరుగురు, 2,501 నుంచి 3,500 వరకు జనాభా ఉన్న సచివాలయానికి (బీ కేటగిరీ) ఏడుగురు, 3,501 కంటే ఎక్కువగా జనాభా ఉన్న సచివాలయానికి (సీ కేటగిరీ) ఎనిమిది మందిని కేటాయించారు. ఇలా ఉద్యోగులను విభజించడంతో దాదాపు 40 వేల మంది ఉద్యోగులు మిగులుగా ఉంటారు. వీరిని ఇతర ప్రభుత్వ శాఖల్లో వివిధ అవసరాలకు ప్రభుత్వం వినియోగించనుంది.
ఇతర శాఖల్లో సర్దుబాటు..
ఇలా దాదాపు 15 వేల మంది గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను ఇతర శాఖల్లోకి సర్దుబాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధపడింది. ఈ నేపథ్యంలో ఇటీవలి రాష్ట్ర మంత్రి, ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం జరిగింది. ఆ సమావేశంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ప్రమోషన్ ఛానల్‌పై డిమాండ్ చేశారు. అందులో భాగంగానే ప్రభుత్వం తొలుత వార్డు సచివాలయం ఉద్యోగుల సీనియారిటీ జాబితాలను తయారు చేయాలని మున్సిపల్ కమిషనర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ సీనియారిటీ జాబితాకు అనుగుణంగానే పదోన్నతలు ఉంటాయి.