స్టార్ హీరో/ హీరోయిన్ కి సంబంధించిన ఫ్లాప్ సినిమా తదుపరి సినిమాని ప్రభావితం చేస్తుంది అనేది ఎంత నిజమో, నిర్మాత పై అంతకు పదింతలు ఎక్కువ ఇబ్బందిగా అనిపిస్తుంది. అలా మహేష్ బాబు(superstar mahesh babu) హీరో గా నటించిన సినిమాలు, ఈరోజు బాక్స్ ఆఫీస్ వద్ద విడుదల కావాల్సిన ‘అఖండ 2′(Akhanda 2 Movie) చిత్రాన్ని వాయిదా పడేలా చేసింది. దీంతో సోషల్ మీడియా లో నెటిజెన్స్ కొంతమంది మహేష్ బాబు ని ఒక రేంజ్ లో ట్రోల్స్ చేయడం మొదలు పెట్టారు. ఇంతకీ అసలు ఏమైందంటే, మహేష్ బాబు కెరీర్ ని బాగా ప్రభావితం చేసిన సినిమాలు 1 నేనొక్కడినే, ఆగడు. మహేష్ బాబు కి దూకుడు వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ని అందించిన 14 రీల్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఈ సంస్థ తో పాటు EROS ఇంటర్నేషనల్ సంస్థ కూడా నిర్మాణం లో భాగం అయ్యింది.
అయితే ఒప్పందం ప్రకారం 14 రీల్స్ సంస్థ నుండి EROS కి దాదాపుగా 28 కోట్ల రూపాయిలు రావాలి. పదేళ్లు దాటినా కూడా 14 రీల్స్ నుండి డబ్బులు రాలేదు. దీంతో ఈ చిత్రాన్ని నిలిపివేయాలి అంటూ మద్రాస్ హై కోర్ట్ లో పిటీషన్ వేశారు. వాస్తవాలను పరిశీలించిన హై కోర్టు ఈ సినిమా విడుదలను నిలిపివేసింది. కేవలం ఈ రెండు సినిమాలు మాత్రమే కాదు, EROS కి దూకుడు కి సంబంధించిన లెక్కలు కూడా కొన్ని సెటిల్ అవ్వాల్సి ఉందట. కేవలం ఈ ఒక్క సంస్థ తో మాత్రమే కాదు, మారాయి నాలుగు సంస్థలతో కూడా ఇలాంటి అప్పులు భారీగానే చేసిందట మూవీ టీం. అందరూ ఒక్కసారిగా అటాక్ చేయడం తో ఈ సినిమాని ఆపేయాలి వచ్చింది. అలా ఈ సినిమా విడుదల ఆగిపోవడానికి ఒక విధంగా మహేష్ బాబు కూడా పరోక్షంగా కారణం అయ్యాడు.
ఇకపోతే ఈ సినిమా ఫైనాన్సియల్ క్లియరెన్స్ మొత్తం పూర్తి అయ్యిందని, ఇక కేవలం కోర్టు తీర్పు రావడం ఒక్కటే బ్యాలన్స్ అంటూ సోషల్ మీడియా లో లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్. కోర్టు తీర్పు పాజిటివ్ గా నేడు రాత్రి సెకండ్ షోస్ నుండి ఈ సినిమా విడుదల అవ్వొచ్చు. కానీ ఓవర్సీస్ లో మాత్రం ఈ వీకెండ్ ని వదిలేయాల్సి ఉంటుంది. ఇప్పటికే నార్త్ అమెరికా లో ఈ సినిమా కి కేటాయించిన షోస్ ని హాలీవుడ్ సినిమాలకు కేటాయించారు. మరి నిర్మాత ఓవర్సీస్ కలెక్షన్స్ లేకపోయినా పర్వాలేదు అని ఈ సినిమాని విడుదల చేసేస్తాడా?, లేదంటే వేరే మంచి రిలీజ్ డేట్ ని ఎంచుకుంటాడా అనేది తెలియాల్సి ఉంది.































