Goat viral video: కరంటు వైర్లపైకి ఎక్కి సూపర్ హీరో లాగా విన్యాసాలు చేసిన మేకకు ఏమైంది?

electrifying goat adventure కరెంట్ తీగలపై ఎక్కి మేక చేసిన అద్భుతమైన స్టంట్లు అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నాయి. అంత ఎత్తైన ఎలక్ట్రిక్ వైర్లపై నడవడమే పెద్ద విషయమైతే… షాక్ తగలకుండా సూపర్ హీరోలా స్టంట్లు ఎలా చేయగలిగిందో చూసిన వారందరూ ఆశ్చర్యపోతున్నారు.


ఎలక్ట్రిఫైయింగ్ గోట్ అడ్వెంచర్ వైరల్ ఇన్ ఒన్లైన్: ఉత్తరప్రదేశ్ లోని ఒక గ్రామంలో కరెంట్ వైర్లపై ఎగబడి ఒక మేక చేసిన సాహసం అందరినీ షాక్ చేస్తోంది. రెండు ఎలక్ట్రిక్ తీగలపై కాళ్లు పెట్టి సర్కస్ లాగా బ్యాలెన్స్ చేస్తూ మేక చేసిన విన్యాసాలు చూసేవారి గుండెలు కొట్టుకుంటున్నాయి. కానీ ఈ మేక మాత్రం తన పని తాను కూల్ గా పూర్తి చేసుకుంది. ఇంత ప్రమాదకరమైన పని చేయడానికి ఎలా తెగించిందో… ఇది ఏమిటి సూపర్ మేకనా? అని నెటిజన్లు అద్భుతంతో ప్రతిస్పందిస్తున్నారు.

సూపర్ మేక… సూపర్ స్టంట్స్…

సాధారణంగా మేకలు గడ్డి నేలమీద తింటాయి కానీ ఈ మేక మాత్రం కరెంట్ వైర్ల మీద ఎలా గడ్డి తింది? అనేది ఒక పెద్ద ప్రశ్న. అసలు అక్కడ గడ్డి ఎలా వచ్చింది? అని ఆలోచిస్తే… ఇది సాధారణ మేక కాదు, ఒక సూపర్ మేక! ఒక్కో తీగ మీద ఒక్కో కాలు పెట్టి బ్యాలెన్స్ చేసుకుంటూ గడ్డి దగ్గరకు చేరుకుంది. కరెంట్ షాక్ తగిలే అవకాశం ఉన్నా, కింద పడిపోతుందేమో అనే భయం ఉన్నా… ఈ మేక మాత్రం ఏమాత్రం భయపడక సర్కస్ లాగా విన్యాసాలు చేస్తూ కూల్ గా ఆకులు కొరికింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

గడ్డి కోసం మేక చేసిన ఈ స్టంట్ వీడియో చూసి విద్యుత్ శాఖ అధికారులు కూడా షాక్ అయ్యారు. నెటిజన్లు ఇంకా ఎక్కువగా రియాక్ట్ అవుతున్నారు. “ఇది మేక కాదు, స్పైడర్ మ్యాన్ కి సోదరి అయి ఉండాలి!” అని ఒకరు ఫన్నీగా కామెంట్ చేశారు. మరొకరు, “ఇది మేకా లేక సర్కస్ లోని యానిమల్ ఆర్టిస్టా?” అని ప్రశ్నించారు. కొందరు, “మేకలకు కరెంట్ షాక్ తగలదు అని ఎక్కడ ఉంది? ఇది హీరో మేక!” అని పరహసిస్తున్నారు. ఇంకొకరు, “నాకు ఈ వీడియో చూస్తేనే కరెంట్ షాక్ తగిలినట్టు అనిపించింది!” అని కామెంట్ చేశారు. ఈ ఇంట్రెస్టింగ్ ఇవెంట్ మీద నెటిజన్లు కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు.