ప్రస్తుతం క్రెడిట్ కార్డుల వాడకం చాలా సర్వసాధారణమైపోయింది. డిజిటల్ యుగంలో క్రెడిట్ కార్డులు మన రోజువారీ అవసరాల్లో భాగమయ్యాయి. కానీ మీ క్రెడిట్ రిపోర్ట్ చూసినప్పుడు ‘SMA’ అని ఒక సారిగా కనిపిస్తుంది.చాలా మంది దీన్ని జరిమానా అనుకుంటారు.
నిజానికి, SMA జరిమానా కాదు. ఇది బ్యాంక్ ఇచ్చే ఒక ముందస్తు హెచ్చరిక సంకేతం. మనం మొబైల్ బ్యాటరీ తక్కువ అయ్యే సమయంలో నోటిఫికేషన్ రావడం లాంటి విధంగా, EMI లేదా క్రెడిట్ కార్డ్ బిల్లు సకాలంలో చెల్లించకపోతే బ్యాంకులు SMA ద్వారా అప్రమత్తత చూపుతాయి.SMA అనేది NPA కాదు. ఇది ఫైన్ లేదా జబ్బు పడేముందు చివరి హెచ్చరిక. సకాలంలో SMAని నిర్వహిస్తే, రుణాలు, క్రెడిట్ కార్డులు, తక్కువ వడ్డీ ఆఫర్లు పొందడం సులభం అవుతుంది.బిజినెస్ స్టాండర్డ్‌లో వెల్లడించినట్లుగా, SMA పూర్తి రూపం ‘స్పెషల్ మెన్షన్ అకౌంట్’. ఇది చెల్లింపుల్లో చిన్న సమస్యలు ఉన్న ఖాతాలను గుర్తించడానికి బ్యాంకులు లేదా NBFCలు ఉపయోగిస్తారు. ఉదాహరణకి, మీ రుణ EMI లేదా క్రెడిట్ కార్డ్ కనీస చెల్లింపు 90 రోజులు ఆలస్యమైతే, అది SMAగా క్రెడిట్ రిపోర్ట్‌లో కనిపిస్తుంది. SMA అంటే, ఖాతాదారు సకాలంలో చెల్లించడంలో జాగ్రత్త తీసుకోలేకపోతున్నారని, బ్యాంకుకు ముందస్తుగా హెచ్చరికగా మారుతుంది.రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) SMAని మూడు రకాలుగా విభజించింది: SMA-0, SMA-1, SMA-2
SMA-0: EMI 1-30 రోజులు ఆలస్యం (చిన్న డిఫాల్ట్)
SMA-1: EMI 31-60 రోజులు ఆలస్యం (మధ్యస్థ సమస్య)
SMA-2: EMI 61-90 రోజులు ఆలస్యం (గంభీర సమస్య)
NPA: 90 రోజులకు ఎక్కువ ఆలస్యం అయితే, ఖాతా NPAగా మారుతుంది.
ప్రతి దశలో బ్యాంక్ ఈ పరిస్థితిని క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలకు (CIC) తెలియజేస్తుంది. SMA ప్రధాన లక్ష్యం బ్యాంకుకు ముందస్తు హెచ్చరిక ఇవ్వడం, తద్వారా ఖాతా NPAగా మారకుండా చర్యలు తీసుకోవడం.SMA ఖాతాలు క్రెడిట్ స్కోర్ పై ప్రతికూల ప్రభావం చూపిస్తాయి. SMA-0 నుండి SMA-2 దశలలో, తరువాత ఖాతా NPAగా మారినప్పుడు, ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది. ఒకటి కంటే ఎక్కువ ఖాతాలు SMAలో ఉంటే, స్కోర్ మీద ప్రభావం ఇంకా పెరుగుతుంది.

































