ఎఫ్‌డీ కంటే మెరుగైన రాబడులకు మార్గం ఏది

నా వయసు 74 ఏళ్లు. ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ త్వరలోనే గడువు తీరనుంది. దీని ద్వారా రూ.25 లక్షలు చేతికి రానున్నాయి. ఈ మొత్తాన్ని ఎక్కడ ఇన్వెస్ట్‌ చేసుకుంటే మెరుగైన రాబడులు వస్తాయి? ప్రభుత్వ పథకాలు అయిన సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్స్‌ స్కీమ్‌ (ఎస్‌సీఎస్‌ఎస్‌), పోస్టాఫీసు మంత్లీ ఇన్‌కమ్‌ స్కీమ్‌ (ఎంఐఎస్‌)లో నాకు పెట్టుబడులు ఉన్నాయి.


మీరు మెరుగైన రాబడుల కోసం ఈక్విటీ సేవింగ్స్‌ ఫండ్స్‌ను పరిగణనలోకి తీసుకోవచ్చు. ఎఫ్‌డీలతో పోలిస్తే ఈక్విటీ ఫండ్స్‌ అస్థిరతలతో ఉంటాయి. కాకపోతే అచ్చమైన ఈక్విటీ ఫండ్స్‌లో అంత అస్థిరతలు ఉండవు. ఇవి 15–30 శాతం వరకు ఈక్విటీల్లో, మిగిలిన మొత్తాన్ని ఫిక్స్‌డ్‌ ఇన్‌కమ్, ఆర్బిట్రేజ్‌ అవకాశాల్లో ఇన్వెస్ట్‌ చేస్తుంటాయి. స్వల్పకాలంలో ఈ ఫండ్స్‌లోనూ రిస్క్‌ ఎక్కువే. కాకపోతే ఐదేళ్లు అంతకుమించిన కాలంలో రిస్క్‌ చాలా తక్కువ.

షార్ట్‌ డ్యురేషన్‌ ఫండ్స్‌ మరోక ఆప్షన్‌. ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ మాదిరే షార్ట్‌ డ్యురేషన్‌ ఫండ్స్‌లోనూ రాబడులు ఉంటాయి. వీటిల్లో లిక్విడిటీ ఎక్కువ. పోస్టాఫీసు ఎంఐఎస్, ఎస్‌సీఎస్‌ఎస్‌ పథకాల్లో మీకు ఇప్పటికే పెట్టుబడులు ఉన్నాయి. వీటి నుంచి క్రమం తప్పకుండా ఆదాయం వస్తుంటుంది. ఈ పథకాల నుంచి రాబడిని ఎప్పటికప్పుడు తీసుకుంటూ ఉంటారు కనుక పెట్టుబడి విలువ పెరగదు. కనుక మీకు ఈక్విటీ సేవింగ్స్‌ ఫండ్స్‌ మెరుగైన ఆప్షన్‌ . ఈక్విటీ వద్దనుకుంటే షార్ట్‌ డ్యురేషన్‌ ఫండ్స్‌కు వెళ్లొచ్చు.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.