పాము కాటు: 99% ప్రాణాల రక్షణకు ఇదే సరైన మార్గం!
వర్షాకాలంలో పాముల కదలికలు పెరుగుతాయి. పొలాల్లో పనిచేసే రైతులు, గ్రామీణ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
పాము కాటుతో ప్రాణాపాయం ఏర్పడే అవకాశముండే విషపూరిత పాములు జూన్, జూలైలో ఎక్కువగా బయట కనిపిస్తాయి. పాము కాటుకు గురైతే వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాలి. నకిలీ వైద్యుల వద్దకు వెళ్లడం వల్ల ప్రాణహాని జరుగవచ్చు.
పాము కాటు లక్షణాలు:
ఛాతీలో బిగుతు
శరీరంలో మొద్దుబారడం
నిద్రపట్టకపోవడం
మాట్లాడటంలో ఇబ్బంది
కొన్ని పాములు ఎటువంటి గుర్తు లేకుండానే కాటు వేస్తాయి. ఉదాహరణకు కోబ్రా. కాబట్టి ఎలాంటి సందేహం ఉన్నా వెంటనే ఆసుపత్రికి వెళ్లాలి.
విషపూరితమైనా కాకపోయినా పాము కాటు వల్ల వాపు, నొప్పి ఉంటాయి. అందువల్ల ప్రాథమిక చికిత్స అవసరం. సంగారెడ్డి జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో యాంటీ వెనమ్ మందులు అందుబాటులో ఉన్నాయి. డాక్టర్ల అభిప్రాయం ప్రకారం, సమయానికి చికిత్స అందితే 99 శాతం పాము కాటు కేసుల్లో ప్రాణాలను కాపాడవచ్చు.
ప్రముఖ సూచనలు:
పొలాల్లో పని చేసే రైతులు రబ్బరు బూట్లు ధరించాలి
చేతులు, కాళ్లు కప్పుకునేలా జాగ్రత్తలు తీసుకోవాలి
పాము కాటు వేస్తే, వెంటనే కాటువేసిన ప్రదేశాన్ని గట్టిగా కట్టాలి
వెంటనే దగ్గరలోని ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలి






























