ఎప్పుడు, ఎలా చనిపోతారో ఒక్క బ్లడ్‌ టెస్ట్‌తో చెప్పవచ్చు! UCL పరిశోధనల్లో..

సాధారణంగా మనం ఎప్పుడైనా జ్వరం వచ్చి ఆస్పత్రికి వెళ్తే.. కనీసం ఓ మూడు నాలుగు రకాల బ్లడ్‌ టెస్టులైనా చేస్తారు. అలాంటి కేవలం ఒక్క బ్లడ్‌ టెస్ట్‌తో ఎప్పుడు, ఎలా చనిపోతామో కూడా తెలుస్తుందంటే షాక్‌ అవుతున్నారా?


తాజా అధ్యాయనం మాత్రం తెలుసుకోవచ్చని చెబుతోంది. స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ, హెల్సింకి యూనివర్సిటీ నిపుణులతో సహా UCL( యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ లండన్‌) పరిశోధనా బృందం, బ్రిటిష్ వైట్‌హాల్ II అధ్యయనంలో పాల్గొన్న 45 నుంచి 69 సంవత్సరాల వయస్సు గల 6,235 మంది వ్యక్తుల రక్త ప్లాస్మా నమూనాలను సేకరించి వాటిపై పరిశోధన జరిపారు. తొమ్మిది అవయవాల (గుండె, రక్త నాళాలు, కాలేయం, రోగనిరోధక వ్యవస్థ, క్లోమం, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, పేగులు మరియు మెదడు) మొత్తం శరీరానికి సంబంధించిన జీవసంబంధమైన వయస్సును నిర్ణయించడానికి పరిశోధకులు పనిచేశారు.

యూసీఎల్‌ చేపట్టిన ఈ పరిశోధన ఫలితాలు లాన్సెట్ డిజిటల్ హెల్త్ జర్నల్‌లో ప్రచురించారు. దీని గురించి UCL ఫ్యాకల్టీ ఆఫ్ బ్రెయిన్ సైన్సెస్ ప్రొఫెసర్ మికా కివిమాకి మాట్లాడుతూ.. “మన అవయవాలు ఒక సమగ్ర వ్యవస్థగా పనిచేస్తాయి, కానీ అవి వేర్వేరు రేట్ల వద్ద వృద్ధాప్యం చెందుతాయి. “ముఖ్యంగా అవయవాలలో వృద్ధాప్యం అనేక వృద్ధాప్య సంబంధిత వ్యాధులకు దోహదం చేస్తుంది, కాబట్టి మన ఆరోగ్యం యొక్క అన్ని అంశాలను జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. ఒక నిర్దిష్ట అవయవం ఊహించిన దానికంటే వేగంగా వృద్ధాప్యం చెందుతుందో లేదో సులభంగా రక్త పరీక్ష ద్వారా గుర్తించవచ్చని మేం కనుగొన్నాం. రాబోయే సంవత్సరాల్లో, ఇలాంటి రక్త పరీక్షలు అనేక వ్యాధులను నివారించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.” అని అన్నారు.

ఈ పరిశోధనల్లో ఒక్క రక్త పరీక్షతో మనిషిలోని అవయవాలు ఎలా పనిచేస్తున్నాయి. ఎంత వేగంగా వాటి వయసు పెరుగుతోంది అనే విషయాలను అంచనా వేయడం ద్వారా రానున్న పదేళ్ల కాలంలో ఆ వ్యక్తి ఎలాంటి రోగాలకు గురి అవుతాడు, ఏ అవయవం దెబ్బతినడం కారణంగా అతను మరణిస్తాడనే విషయాన్ని తెలుసుకోవచ్చు అంటా. ఉదాహరణకు ఒక మనిషికి ఈ ప్రత్యేకమైన బ్లడ్‌ టెస్ట్‌ చేయడం ద్వారా.. అతని శరీరంలోని గుండె, కాలేయం, ఊపిరితిత్తులు, రక్తనాళాలు, మెదడు, మూత్ర పిండాలు లాంటి ముఖ్యమైన భాగాల ఏజింగ్‌ ప్రాసెస్‌ను అంచనా వేయవచ్చు. ఓ 30 ఏళ్ల వ్యక్తికి అతని అవయవాలు కూడా 30 ఏళ్లకు తగ్గట్లు ఉండాలి. కానీ, అతను తినే ఆహారం, కాలుష్యం, శారీర శ్రమలేకపోవడం వల్ల అతని అవయవాల్లో కొన్ని 30 ఏళ్ల కంటే మించి ఓ 40 ఏళ్ల వ్యక్తిలో ఉండే ఆర్గాన్‌లా మారుతుంది. అంటే మనిషి ఏజ్‌ కంటే కూడా అని బాడీలోని ఆర్గాన్‌ ఏజ్‌ త్వరగా పెరుగుతుంది. దాంతో అ ఆర్గాన్‌ త్వరగా ఫెయిల్‌ అయ్యే అవకాశం ఉంటుంది. గుండె వయస్సు అనే వ్యక్తి వయసు కంటే ఎక్కువ ఉంటే అతనికి గుండె సంబంధిత రోగాలు హార్ట్‌ ఎటాక్‌ లాంటివి వచ్చే ప్రమాదం ఉంది.