శరీర కండరాల పెరుగుదలకు, ఆరోగ్యానికి ప్రోటీన్ అత్యవసరం. మాంసాహారులకు గుడ్డు, శాకాహారులకు పప్పు ముఖ్యమైన వనరులు. గుడ్డు ‘పూర్తి ప్రోటీన్’ గా, అవసరమైన 9 రకాల అమైనో ఆమ్లాలను అందిస్తుంది.
విటమిన్ B12, D, ఫ్యాట్స్ కూడా ఉంటాయి. పప్పు ప్రోటీన్‌తో పాటు అధిక ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం అందిస్తుంది. పూర్తి ప్రోటీన్ కావాలంటే గుడ్డు, తక్కువ కొవ్వు, ఫైబర్ ఎక్కువ కావాలంటే పప్పు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
































