జుట్టుకు రంగు వేయాల్సిన పనిలేదు.. ఈ ఆకు మరిగించి రాస్తే తెల్ల జుట్టుకు చెక్‌

జుట్టుకు సహజ సిద్ధమైన రెమెడీ కోసం ప్రయత్నిస్తే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మార్కెట్లో అందుబాటులో ఉండే కెమికల్స్ ఉత్పత్తులను ఎక్కువ డబ్బులు వెచ్చించి తీసుకుంటారు.


వీటిని జుట్టుకు అప్లై చేసిన కానీ అవి సైడ్ ఎఫెక్ట్స్ చూపిస్తాయి. తెల్ల జుట్టు మరింత పెరిగిపోతుంది. అంతేకాదు కుదుళ్ళు మొత్తం పొడిబారి పోతాయి. హెయిర్ ఫాల్ సమస్య కూడా వస్తుంది. ఇవి కాకుండా కొన్ని సహజసిద్ధమైన టిప్స్ పాటిస్తూ జుట్టును సంరక్షించుకోవాలి.

మన దేశంలో ప్రతి చెట్టు ఆకుల ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. అయితే తెల్ల జుట్టు సమస్య కూడా పరిష్కరించే ఆకులు ఉన్నాయి.ఈ నేపథ్యంలో మనం తెల్ల జుట్టు సమస్యకు సహాయపడే ఆకులు ఏంటో తెలుసుకుందాం..

జామ ఆకు, కరివేపాకు వేపాకు, ఈ మూడిటినీ కలిపి పేస్ట్ చేసి కొబ్బరి నూనెలో వేసి మరిగించి జుట్టు అంతటికీ అప్లై చేయాలి. ఒక గంట తర్వాత తల స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల తెల్ల జుట్టుకు సమస్యకు శాశ్వతంగా పరిష్కారం లభిస్తుంది.

ఇది మాత్రమే కాదు జామ ఆకు బాగా మరిగించి నీళ్లు సగం అయ్యాక ఆ నీటిని పట్టించి తర్వాత తల స్నానం చేయాలి. ఇది కూడా మంచి రెమెడీగా పనిచేస్తుంది. జామ ఆకులలో ప్రయోజనాలు ఉంటాయి. ఇది క్యాన్సర్, డయాబెటిస్ కూడా చెక్‌ పెడుతుంది. జామ ఆకులో విటమిన్ సి, ఫైబర్ కూడా ఉంటుంది. డయాబెటిస్ వారు తీసుకోవచ్చు.

జామ ఆకు జుట్టుకు కూడా మంచి పరిష్కారం. జుట్టు కుదుళ్ళపై ఉండే చుండ్రును కూకటివేళ్ళతో తొలగిస్తుంది. జామ ఆకు, వేపాకును మరిగించి తల స్నానం చేయటం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. కెమికల్స్ ఉండే ఉత్పత్తులను ఉపయోగించడం కంటే ఇలాంటి సహజసిద్ధమైన రెమెడీస్ ప్రయత్నిస్తే తెల్ల జుట్టు సమస్యకు శాశ్వతకు పరిష్కారం.