Popular Chief Minister: దేశంలోనే అత్యంత పాపులర్‌ సీఎం ఎవరంటే..?

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Join Now
Facebook Page Join Now

దేశంలో అత్యంత ప్రజాదారణ కలిగిన ముఖ్యమంత్రుల జాబితా ఒకటి తాజాగా వెల్లడైంది. మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో నిర్వహించిన సర్వేలో అత్యంత ప్రజాదారణ కలిగిన ముఖ్యమంత్రులు జాబితాలో ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌కు 52.7 శాతం ఓట్లతో మొదటి స్థానంలో నిలించారు.
వివాదరహితుడుగా ఉన్న నవీన్ పట్నాయక్‌కు ప్రజలు బెస్ట్ ముఖ్యమంత్రిగా పట్టంకట్టారు. ఆ తర్వాతి స్థానంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రెండో స్థానంలో నిలించారు. ఈయనకు 51.3 శాతం మంది ప్రజలు రేటింగ్ ఇచ్చారు.

ఆ తర్వాతి స్థానంలో 48.6 శాతం ఓట్లతో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వాశర్మ మూడో స్థానంలో నిలువగా, నాలుగో స్థానంలో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పాటిల్ 42.6 శాతం ఓట్లు, త్రిపుర ముఖ్యంమత్రి మాణిక్ సాహుకు 41.4 శాతం ఓట్లు దక్కాయి. ఆయన అత్యంత ప్రజాదారణ కలిగిన ముఖ్యమంత్రుల జాబితాలో ఐదో స్థానంలో నిలించారు.

మాణిక్ సాహా తర్వాతి స్థానంలో 41.1 శాతం ఓట్లతో గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, 40.1 శాతం ఓట్లతో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామిలు ఈ జాబితాలో ఆరు, ఏడు స్థానాల్లో నిలించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మాత్రం ఎనిమదో స్థానం దక్కింది. ఈయనకు 36.5 శాతం మాత్రమే రేటింగ్ వచ్చింది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌కు 35.8 శాతం రేటింగ్‌తో తొమ్మిదో స్థానంలో నిలువగా, 32.8 శాతం ఓట్లతో బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పదో స్థానంలో నిలిచారు. ఈ జాబితాలో గత నాలుగున్నరేళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి చోటే దక్కలేదు.

Related News

Related News