Viral Video: ఏపీలో వండర్ కిడ్.. వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన 4 నెలల చిన్నారి..

Viral Video: ఏపీలో వండర్ కిడ్.. వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన 4 నెలల చిన్నారి..
ఎన్టీఆర్ జిల్లా నందిగామకు చెందిన ఓ పాప నాలుగు నెలల వయసులో వండర్ క్రియేట్ చేస్తోంది. ఒకటి, రెండు వస్తువులు కాదు ఏకంగా 120 వస్తువులను గురించి చెప్పి వరల్డ్ రికార్డ్ సాధించింది. ఆ చిన్నారి కంటి చూపు మెరుగుపర్చడం కోసం సన్నిహితుల సలహాతో బ్లాక్ అండ్ వైట్ కార్డులను చూపించడం మొదలుపెట్టారు పాప తల్లి.
ఎన్టీఆర్ జిల్లా నందిగామకు చెందిన ఓ పాప నాలుగు నెలల వయసులో వండర్ క్రియేట్ చేస్తోంది. ఒకటి, రెండు వస్తువులు కాదు ఏకంగా 120 వస్తువులను గురించి చెప్పి వరల్డ్ రికార్డ్ సాధించింది. ఆ చిన్నారి కంటి చూపు మెరుగుపర్చడం కోసం సన్నిహితుల సలహాతో బ్లాక్ అండ్ వైట్ కార్డులను చూపించడం మొదలుపెట్టారు పాప తల్లి. తన కుమార్తె ఆ కార్డులను శ్రద్ధగా చూస్తుండటాన్ని గమనించి మరింత తర్పీదునిచ్చింది. పిట్ట కొంచెం కూత ఘనం అనే పదానికి నిదర్శనం ఈ పాప. ఎన్టీఆర్ జిల్లా నందిగామకు చెందిన రమేష్, హోమ దంపతుల కుమార్తె కైవల్య 4 నెలల వయస్సులోనే 120 రకాల పక్షులు, కూరగాయలు, పండ్లు, జంతువులు, పూలు ఫోటోలను గుర్తుపట్టగలుగుతుంది. ఈ విషయం తెలుసుకున్న తల్లి తండ్రులు ఆశ్చర్యానికి గురయ్యారు. పుట్టిన నాలుగు నెలల కాలంలోనే ఈ ఘనత సాధించడం తమకు ఎంతో సంతోషంగా ఉందని పాప తల్లిదండ్రులు చెపుతున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరిలో ఎదో ఒక టాలెంట్ ఉంటుంది. తన కూతురులో ఉన్న టాలెంట్ బయటకు తీయాలనే ఉద్దేశంతో ఒక ప్రయోగం చేశానన్నారు పాప తల్లి హోమ.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Join Now
Facebook Page Join Now

చిన్న వయసులోనే పాపకు అన్ని రకాల జంతువులు, కూరగాయలు, ఫ్రూట్స్ ఇతరత్రా వాటిని గుర్తు పట్టే విధంగా తాను చేసిన ప్రయోగం సత్ఫలితాన్ని ఇచ్చిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మూడు నెలల వయసులో బ్లాక్ అండ్ వైట్ ఫోటోలను చూపించానని చెప్పారు. అప్పుడు పాపలో చురకు తనాన్ని చూసి నాలుగో నెల నుంచి కలర్ ఫోటోలో ఉన్న 120 రకాల జంతువులు, పండ్లు, కూరగాయలు, పూలు ఫోటోలను చూపిస్తుంటే పాప వాటిని చేత్తో పట్టుకొని గుర్తు పడుతోందని వివరించారు. దీనిని గమనించి తల్లి తండ్రులు ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‎కు పంపగా వారు తిరస్కరించారు. తన పాపకు ఉన్న టాలెంట్ ఎలాగైనా బయటకు తీయాలన్న పట్టుదలతో నోబెల్ వరల్డ్ రికార్డ్స్‎కు అప్లై చేయడంతో వారు పాప వీడియో పంపాలని సూచించినట్లు తెలిపారు. పాప గుర్తు పట్టే బొమ్మల వీడియోలు నోబెల్ వరల్డ్ రికార్డ్స్‎కు పంపామని.. వారం రోజుల వ్యవధిలో వారు పాప టాలెంట్ గుర్తించి వరల్డ్ రికార్డ్స్‎కు సెలెక్ట్ అయినట్లు చెప్పారన్నారు. ఈ విషయం తమకు తెలియడంతో ఆనందానికి అవధులు లేకుండా పోయాయని పాప తల్లిదండ్రులు చెపుతున్నారు. రెండు రోజులు క్రితం నోబెల్ వరల్డ్ రికార్డ్ సంబంధించిన సర్టిఫికెట్, పతకాన్ని తమకు అందాయని కుటుంబ సభ్యులు తెలిపారు. టాలెంట్ ఉంటే ఎంతటి అవరోధాన్ని అయిన అందుకోవచ్చు అనే దానికి నిదర్శనం మా 4 నెలల పాప కైవల్య అని భావిస్తున్నామన్నారు తల్లి తండ్రులు.

Related News