హరియాలీ తీజ్ మహిళలు జరుపుకునే సాంప్రదాయ పండుగ. ఈ రోజున వివాహం అయిన స్త్రీలు భర్త ఆరోగ్యం కోసం పూజలు చేస్తారు. ఉదయం నుంచి ఉపవాసం దీక్షలో నీరు కూడా తాగకుండా సాయంత్రం వరకూ ఉంటారు.
కొన్ని చోట్ల పెళ్ళికాని అమ్మాయిలు కూడా ఈ వేడుకను చేస్తారు. వివాహానికి దగ్గరలో ఉన్నట్లయితే ప్రేమించే భర్త రావాలని, తల్లిదండ్రుల ఆశీస్సులు పొందుతారు.
హరియాలీ తీజ్ ఎలా జరుపుకుంటారు.
హరియాలీ తీజ్ మహిళలు జరుపుకునే సాంప్రదాయ పండుగ. ఈ రోజున వివాహం అయిన స్త్రీలు భర్త ఆరోగ్యం కోసం పూజలు చేస్తారు. ఉదయం నుంచి ఉపవాసం దీక్షలో నీరు కూడా తాగకుండా సాయంత్రం వరకూ ఉంటారు. భర్త శ్రేయస్సు, సంసార జీవితం బావుండాలని ఈ ఉపవాస నియమాన్ని కఠినంగా పాటిస్తారు.
హరియాలీ తీజ్ వేడుకలో భాగంగా సాయంత్రం వేళ మహిళలు, పిల్లలు ఊయల ఊగుతారు. చేతులకు గోరింటాకు పెట్టుకుంటారు. గోరింటాకు ఎంత ఎర్రగా పండితే అంత ఆనందంగా భర్తతో జీవితం ఉంటుందని పార్వతీదేవి చెప్పినట్టుగా నమ్ముతారు.
అమ్మవారి ఆరాధనకు స్త్రీలు కొత్త దుస్తుల్లో ముస్తాబు అవుతారు. శివపార్వతులను పూజిస్తారు. కలకండ్, స్వీట్లు, ఖీర్ తయారుచేసుకుని తింటారు. ఖీర్ హరియాలీ తీజ్ రోజున ప్రత్యేకంగా తయారుచేసే వంటకం.
వెర్మిసెల్లిని నెతిలో వేయించాలి. కాస్త ఎర్రటి రంగు వచ్చే వరకూ వేయించి తీయాలి. ఇలా చేయడం వల్ల రుచి పెరుగుతుంది.
పాన్ పెట్టి పాలను పోసి మరిగించాలి. పాలు బాగా మరిగిన తర్వాత వేయించిన వెర్మిసెల్లిని వేసి ఉడికించాలి. ఇది కాసేపు ఉడికిన తర్వాత పంచదారను వేసి కలపాలి. బాగా ఉడికిన మిశ్రమంలో యాలకుల పొడిని కలిపాలి. వేయించిన బాదం, జీడిపప్పు, కిస్ మిస్, పిస్తా వేయడం వల్ల మంచి రుచి వస్తుంది.
గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.