నెలకు రూ.5వేలు పెట్టుబడితో రిటైర్మెంట్ నాటికి కోటీశ్వరులు అవ్వచ్చు..

ప్రజల ఆర్థిక భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను తీసుకువచ్చింది. అలాంటి పథకాల్లో నేషనల్ పెన్షన్ సిస్టమ్ (National Pention Scheme) కూడా ఒకటి.


ఇది పొదుపు ఆధారిత రిటైర్మెంట్ పథకం. 2009లో కేంద్రం ప్రభుత్వం దీనిని ప్రవేశపెట్టంది. 18ఏళ్లు నిండిన దేశ పౌరులు ఈ స్కీమ్ లో చేరవచ్చు. ఈ స్కీమ్ లో ప్రతినెలా చిన్న మొత్తాల్లో డబ్బును పొదుపు చేస్తే రిటైర్మెంట్ నాటికి పెద్దమొత్తంలో కార్పస్ ఏర్పాటు చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఈ పథకంలో నెలకు రూ.5వేలు పొదుపు చేస్తే రిటైర్మెంట్ నాటికి కోటీశ్వరులు అవ్వొచ్చు. ప్రైవేటు, ప్రభుత్వ రంగాల్లో పనిచేసే ఉద్యోగులతో పాటు అసంఘటిత రంగాల్లో పనిచేసే కార్మికులు కూడా ఈ పథకానికి అర్హులే. నేషనల్ పెన్షన్ సిస్టమ్ స్కీమ్ అనేది ఒక దీర్ఘకాలిక పెట్టుబడి పథకం అని చెప్పుకోవచ్చు.

ఇందులో చేరితే నిబంధనల ప్రకారం 60 ఏళ్లకు రిటైర్మెంట్ అయిన తరవాత చేతికి వచ్చే డబ్బులలో 40 శాతం యాన్యుటీ స్కీమ్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దీని ద్వారా ప్రతినెల పెన్షన్ వస్తుంది. దీనికోసం ప్రత్యేకంగా పెన్షన్ ప్లాన్ కొనుగోలుచేసే అవసరం ఉండదు. దీంతో పాటు మిగిలిన 60శాతం డబ్బులు ఒకేసారి చేతికి అందుతాయి. మొత్తం కార్పస్ రూ.5 లక్షల లోపు ఉన్నట్లయితే మొత్తం డబ్బును తీసుకోవచ్చు. ఇందులో 25 సంవత్సరాల వయసులో ఉద్యోగంలో చేరిన వ్యక్తి నెలకు రూ.5వేలు ఇన్వెస్ట్ చేస్తే అతను మరో 35ఏళ్లు కొనసాగించాలి.

60ఏళ్లు వచ్చే వరకు క్రమం తప్పకుండా నెలకు రూ. 5వేలు జమ చేయాలి. ఎన్‌పీఎస్ అనేది మార్కెట్ లింక్డ్ స్కీమ్ దీర్ఘకాలంలో ఇందులో సగటున 8 నుండి 10 శాతం రాబడి వచ్చే అవకాశం ఉంది. 10 శాతం రాబడి వస్తుందని అనుకున్నట్లయితే.. 25ఏళ్ల వ్యక్తి నెలకు రూ.5వేల చొప్పున 35ఏళ్ల పాటు పెట్టుబడి పెడితే దాని విలువ మొత్తం రూ.21 లక్షలు అవుతుంది. దీనిపై ప్రతిఏడాది 10 శాతం చొప్పున కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ వస్తుందనుకుంటే కార్పస్ మొత్తం రూ.1.72 కోట్లు అవుతుంది. 60ఏళ్ల వయసు వచ్చే నాటికి అతడు కోటీశ్వరుడు అవుతాడు. దీనిలో నుండి 40 శాతం అంటే రూ.68.63 లక్షలు యాన్యుటీ ప్లాన్ కొనుగోలు చేయాలి. మిగితా రూ.1.03 కోట్లను చేతికి తీసుకునే అవకాశం ఉంటుంది. యాన్యుటీ స్కీమ్ ద్వారా సంవత్సరానికి 6శాతం రాబడి వస్తుందని అనుకుంటే ప్రతినెల చేతికి రూ.34వేల వరకు వస్తాయి. కాబట్టి ఈ స్కీమ్ లో చేరితే ఎలాంటి టెన్షన్ లేకుండా బతికేయవచ్చు. రిటైర్మెంట్ తరవాత కూడా ఎవరిపైనా ఆధారపడాల్సిన అవసరం ఉండదు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.