తక్కువ ధర, ఎక్కవ మైలేజ్, సింపుల్ మెయింటేనెన్స్తో ఎన్నో ఏళ్ల నుంచి మధ్య తరగతి వారి హృదయాల్లో నిలిచిపోయే ముద్రను వేసుకుంది బజాజ్ కంపెనీకి చెందిన ప్లాటినా బైక్.
ఈ బైక్ మార్కెట్లోకి వచ్చినప్పటి నుంచి మైలేజ్‌లో రారాజుగా పేరు తెచ్చుకుంది. మధ్య తరగతి ప్రజలు ఎక్కవ శాతం రోజువారి పనుల కోసం చాలా దూరం ప్రయాణిస్తారు.అలాంటి సందర్భంలో ఈ బైక్ వారికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ బైక్ సగటున లీటర్‌కు 70-90 కిలో మీటర్ల మైలేజ్ ఇస్తుందని వినియోగదారులు అంటున్నారు.
బాజాజ్ కంపెనీ ఇప్పుడు ఈ బైక్‌ను మరింత అప్డేట్ చేసి వినియోగదారులకు రెండు వేరియంట్లలో అందుబాటులోకి తీసుకొచ్చింది. వాటిలో బజాజ్ ప్లాటినా 100, మరోటి ప్లాటినా 110 డ్రమ్ పేరుతో మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇక ఎంట్రీలెవెల్ ప్లాటినా 100ను వినియోగదారులు చాలా తక్కువ ధరలో కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో ఈ బైక్ ఎక్స్ షోరూమ్ ధర రూ. 65,407 మాత్రమే, ఇక ప్లాటినా 110 విషయానికి వస్తే దీని ఎక్స్‌షో రూమ్ ధర రూ.69,284గా ఉంది.
ప్రస్తుతం మార్కెట్లోకి వచ్చిన ప్లాటినా 100లో 102 సీసీ 4-స్ట్రోక్, సింగిల్ సిలిండర్ DTS-i ఇంజిన్ కలిగి ఉంది. బజాజ్ ప్రత్యేకంగా రూపొందించిన ఈ ఇంజిన్ తక్కువ పెట్రోల్‌ను యూజ్ చేసుకొని ఎక్కువ దూరం ప్రయాణిస్తుంది. అందుకే ఇది మార్కెట్లో మైలేజ్ రారాజుగా పేరొందింది. ఇది డేలీ ఆఫీస్ వెళ్లే వారికి, ఫుడ్ డెలివరీ, రాపిడో రైడర్స్, రైతులకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది.
ఈ బైక్ 11 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీతో వస్తుంది. ఈ బైక్‌ను ఒక్కసారి ఫుల్ ట్యాంక్ చేస్తూ దాదాపు 7 నుంచి 8 వందల కిలో మీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. ఇక ప్లాటినా 110, 100 కన్నా పవర్ ఫుల్ ఇంజన్‌ను కలిగి ఉంటుంది. ఇది లాంగ్ రైడ్స్ వెళ్లే వారికి కూడా ఎంతో సైకర్యకరంగా ఉండేలా డిజైన్ చేయబడింది.
ఈ బైక్‌కు మరో ప్లస్ పాయింట్ ఏంటంటే ఇది 115.45 సీసీ సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్, ఫ్యూయల్ ఇంజెక్టెడ్ ఇంజిన్‌తో వస్తుంది. ఈ సరికొత్త టెక్నాలజీ థ్రాటిల్ రెస్పాన్స్ మెరుగుపరుస్తుంది. ఈ బైక్ ఇంజన్ పవర్‌తో మీరు ఎత్తైన ప్రదేశాల్లో ప్రయాణించేప్పుడు కూడా ఎలాంటి ఒత్తిడిని ఎదుర్కోరు.

































