హైటెక్ సిటీ దగ్గరలో 15 లక్షలకే 100 గజాల స్థలం.. సామాన్యులకిదే మంచి ఛాన్స్!

హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి ఒకప్పుడు ఇవన్నీ సాధారణ ప్రాంతాలే. కానీ ఇప్పుడు అవి అసాధారణ ప్రాంతాలుగా రూపాంతరం చెందాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఏరియా కూడా ఈ ఏరియాల్లానే ఫ్యూచర్ లో రియల్ ఎస్టేట్ లో కింగ్ గా మారనుంది.


ఆ ఏరియాలో ఇన్వెస్ట్ చేస్తే కనుక.. ఒకప్పుడు మాదాపూర్, హైటెక్ సిటీ ప్రాంతాల్లో ఇన్వెస్ట్ చేయలేకపోయామే అన్న బాధ ఉండదు. అంతలా ఈ ప్రాంతం లాభాలు తెచ్చిపెడుతుందని రియల్ ఎస్టేట్ నిపుణులు అంటున్నారు.

ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్స్:

ఆ ఏరియా మహేశ్వరం. తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ డెవలప్ చేస్తున్న ఎలక్ట్రానిక్ హార్డ్ వేర్ పార్క్, ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రియల్ పార్క్, దగ్గర్లో హైదరాబాద్ ఫార్మా సిటీ వంటి ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్స్ డెవలప్ అవుతున్నాయి. ఈ కారణంగా రియల్ ఎస్టేట్ మార్కెట్ ఇక్కడ ఆశాజనకంగా ఉంది. టీసీఎస్, హెచ్సీఎల్, టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్, విప్రో సెజ్ వంటి ప్రధాన ఎంప్లాయిమెంట్ హబ్స్ మహేశ్వరం ఏరియాకి దగ్గరగా ఉండడం మరో అడ్వాంటేజ్. ఈ ఇండస్ట్రియల్ ఏరియాల వల్ల మహేశ్వరంలో రియల్ ఎస్టేట్ అనేది బలోపేతమవుతుంది. హెచ్ఎఫ్సీఎల్ ప్రపోజ్ చేసిన ఫైబర్ ప్రాజెక్ట్, కన్స్యూమర్ కేర్ సెక్టార్ లో విప్రో పెట్టుబడులు వంటివి మహేశ్వరంలో అదనంగా రియల్ ఎస్టేట్ గ్రోత్ కి కారణమవ్వనున్నాయి. అలానే ఇక్కడ ప్రముఖ విద్యాసంస్థలు, హెల్త్ కేర్ సంస్థలు కూడా ఉన్నాయి.

కనెక్టివిటీ:

ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే.. ఈ ఏరియా అవుటర్ రింగ్ రోడ్ కి చాలా దగ్గరలో ఉంది. ఇది నగరంలోని ఇతర ప్రాంతాలను, ముఖ్యంగా శ్రీశైలం హైవేని కలుపుతుంది. మహేశ్వరంలో రీజనల్ రింగ్ రోడ్ సహా పలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ని తెలంగాణ ప్రభుత్వం డెవలప్ చేయనుంది. హైవేలకు, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి, ప్రధానమైన ల్యాండ్ మార్క్స్ కి దగ్గరలో ఉన్న కారణంగా మహేశ్వరం ఏరియా బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ గా చూస్తున్నారు ఇన్వెస్టర్స్. ఉపాధి అవకాశాలు పెరగడం, కనెక్టివిటీ, సరసమైన ధరలకే ఇక్కడ స్థలాలు దొరుకుతున్న కారణంగా చాలా మంది ఇక్కడ కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. మహేశ్వరంలో ఇండ్ల స్థలాలకు డిమాండ్ పెరుగుతుంది. భవిష్యత్తులో మంచి అప్రిసియేషన్ వస్తుందని అంటున్నారు. ఇక్కడ ఇండిపెండెంట్ విల్లాలు, అపార్టుమెంట్ల కంటే స్థలాలు మరింత బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉన్నాయి. పైగా ప్రాపర్టీ ట్యాక్సులు, మెయింటెనెన్స్ కాస్ట్ వంటివి తక్కువ.

ధరలు ఎలా ఉన్నాయంటే?:

ప్రస్తుతం మహేశ్వరంలో చదరపు అడుగు స్థలం 1650 రూపాయలుగా ఉంది. గజం 14,850 రూపాయలుగా ఉంది. ఒక వంద గజాల స్థలం కొనాలంటే రూ. 14,85,000 అవుతుంది. 15 లక్షలతో 100 గజాల స్థలం సొంతం చేసుకోవచ్చు. 22 లక్షలు పెట్టుకుంటే 150 గజాల స్థలం పొందవచ్చు. హైదరాబాద్ కి 50 కి.మీ. దూరంలో ఉంది. 50 నిమిషాల్లో సిటీకి చేరుకోవచ్చు. గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్ సిటీ ప్రాంతాలకు 50 నిమిషాల్లోపే చేరుకోవచ్చు.

గమనిక: ఈ కథనం కేవలం అంతర్జాలంలో దొరికిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. గమనించగలరు.