124 ఏళ్ల బామ్మ.. ఆమె దీర్ఘాయుష్షుకు ఈ అలవాట్లే కారణం!!

తాతలనాటి కాలంలో చాలామంది వందేళ్లకు పైగా బతికేవాళ్లు అంటుంటారు పెద్దలు. మరిప్పుడూ?.. ఎవరైనా వందేళ్లు బతికితే.. వామ్మో అది సంచలనమే అనుకోవాల్సిందే ఇక! ఎందుకంటే ఈ కాలంలో 70 ఏళ్లకు మించి బతికేవారు చాలా అరుదు. 60 ఏండ్ల తర్వాత ఇంకెంత కాలం బతుకుతారనే గ్యారెంటీ ఎవరికీ లేకుండా పోయింది. అలాంటిది ఎవరైనా వందేళ్లు దాటి.. మరో రెండు దశాబ్దాలు కూడా దాటి.. ఇంకా బతికే ఉంటున్నారంటే ఎవరికైనా ఏమనిపిస్తుంది? వెంటనే ఆశ్చర్యం వేస్తుంది. ఆ తర్వాత ఆలోచనలో పడిపోతారు.. అదెలా సాధ్యమైందో తెలుసుకోవాలి అనుకుంటారు. కొలంబియా దేశానికి చెందిన ఓ బామ్మ జీవితం కూడా అదే ఆసక్తిని రేకెత్తిస్తున్నది. 124 ఏళ్ల వయసులోనూ ఆమె యాక్టివ్‌గా, హెల్తీగా ఉండటమే ఇందుకు కారణం! హౌ ఈజ్ పాజిబుల్?


ఈ ఆహారమే కారణమా?

పేరు మారియా ఆంటోనియా (Maria Antonia).. 1901లో జన్మించిన, కొలంబియా దేశానికి చెందిన ఈ బామ్మ వయసు ప్రస్తుతం 124 ఏళ్ల 128 రోజులు. ఆశ్చర్యం ఏమిటంటే.. ఆమె ఇప్పటికీ ఆరోగ్యంగా, యాక్టివ్‌గా ఉండటమే అందరినీ ఆలోచింపజేస్తున్నది. ఇదే విషయాన్ని ఆమెను, ఆమె కుటుంబాన్ని అడిగితే.. ‘ఏమో ఎక్కువ రోజులు బతకాలని మేమేం ప్రత్యేక ప్రయత్నాలు చేయలేదు.. మాది సాధారణ జీవితం, ఇక అంటోనియా విషయానికి వస్తే ఆమె రోజూ రెండు ఉడకబెట్టిన బంగాళ దుంపలు లేదా కాల్చిన పచ్చి అరటికాయలు చేపలు తింటుంది. రోజువారీ పనులు చేసుకుంటుంది, సంతోషంగా ఉంటుంది’ అంటున్నారు. దీనిని బట్టి సింపుల్ లైఫ్ స్టైల్, బ్యాలెన్స్‌డ్ హెల్తీ‌ఫుడ్, పాజిటివ్ మైండ్‌సెట్, శారీరక శ్రమ వంటి డైలీ రొటీన్స్ ఆమె దీర్ఘాయుష్షుకు కారణమని నిపుణులు అంచనాకు వస్తున్నారు.

నిపుణులు ఏమంటున్నారు?

ఆంటోనియా కూడా తాను రోజూ రెండు ఉడికించిన ప్లాంటైన్స్ తినడం, చేపలు తినడం, రోజువారీ పనులు చేసుకుంటూ సంతోషంగా ఉండటమే తన దీర్ఘాయుష్షుకు కారణమని నమ్ముతున్నది. ప్రస్తుతం ఆంటోనియా కథ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. సింపుల్ అండ్ స్ట్రెస్ లెస్ లైఫ్‌స్టైల్, పాజిటివ్ మైండ్‌సెట్, ఫిజికల్ యాక్టివిటీస్ డైలీ రొటీన్‌లో భాగం కావడమే ఆమె124 ఏళ్లకు పైగా బతికేందుకు కారణమని చాలామంది భావిస్తున్నారు. పోషకాహార, ఆరోగ్య నిపుణులు కూడా ఆమె రోజువారీ అలవాట్లు, సానుకూల దృక్పథం, రోజుకు రెండు ఉడకబెట్టిన లేదా కల్చిన అరటి కాయలు లేదా బంగాళ దుంపలు తినడం, వీటితోపాటు చేపలు, సీజనల్ కూరగాయలు, పండ్లు ఆహారంలో భాగం చేసుకోవడం, తగిన శారీరక శ్రమ కలిగి ఉండటం వంటివి ఆమె దీర్ఘాయుష్షుకు కారణం కావచ్చునని అంగీకరిస్తున్నారు.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.