మీరు జాబ్ సెర్చ్ లో ఉన్నారా? ఇంకా మీకు జాబ్ దొరకలేదా? అయితే మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. రైల్వే డిపార్ట్ మెంట్ లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ప్రభుత్వ ఉద్యోగం లక్ష్యంగా పెట్టుకున్న వారు ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. రైల్వే జాబ్స్ కోసం ట్రై చేస్తున్నవారికి ఇదే మంచి ఛాన్స్. ఏకంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించి లైఫ్ లో స్థిరపడిపోవచ్చు. రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డ్ 1376 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఈ ఉద్యోగాలకు అర్హతలు ఏంటి? వయోపరిమితి ఎంత? దరఖాస్తుకు చివరి తేదీ ఎప్పుడు ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
మీరు రైల్వే జాబ్స్ కోసం ఎదురుచూస్తున్నట్లైతే ఈ ఉద్యోగాలకు ట్రై చేయండి. ఆర్ఆర్బీ దేశ వ్యాప్తంగా వివిధ కేటగిరీల్లో పారా-మెడికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను రీలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా వివిధ రైల్వే రీజియన్లలో 1,376 పారా మెడికల్ ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో 10+2, జీఎన్‌ఎం, డిప్లొమా, డిగ్రీ, పీజీ డిప్లొమా, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి. పోస్టులను అనుసరించి 18-43ఏళ్లు కలిగి ఉండాలి. అర్హత, ఆసక్తి ఉన్నవారు సెప్టెంబర్ 16వ తేదీలోగా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.
ముఖ్యమైన సమాచారం:
మొత్తం పోస్టులు: 1376
విభాగాల వారీగా ఖాళీలు :
డైటీషియన్ (లెవల్-7) పోస్టులు : 05
నర్సింగ్ సూపరింటెండెంట్ పోస్టులు : 713
అడియాలజిస్ట్ అండ్ స్పీచ్ థెరపిస్ట్ పోస్టులు : 04
క్లినికల్ సైకాలజిస్ట్ పోస్టులు : 07
డెంటల్ హైజీనిస్ట్ పోస్టులు : 03
డయాలసిస్ టెక్నీషియన్ పోస్టులు : 20
హెల్త్ అండ్ మలేరియా ఇన్‌స్పెక్టర్ గ్రేడ్-III పోస్టులు : 126
ల్యాబొరేటరీ సూపరింటెండెంట్ పోస్టులు : 27
పెర్ఫ్యూషనిస్ట్ పోస్టులు : 02
ఫిజియోథెరపిస్ట్ గ్రేడ్-II పోస్టులు : 20
ఆక్యుపేషనల్ థెరపిస్ట్ పోస్టులు : 02
క్యాథ్ ల్యాబొరేటరీ టెక్నీషియన్ పోస్టులు : 02
ఫార్మసిస్ట్ (ఎంట్రీ గ్రేడ్) పోస్టులు : 246
రేడియోగ్రాఫర్ ఎక్స్-రే టెక్నీషియన్ పోస్టులు : 64
స్పీచ్ థెరపిస్ట్ పోస్టు : 01
కార్డియాక్ టెక్నీషియన్ పోస్టులు: 04
ఆప్టోమెట్రిస్ట్ పోస్టులు: 04
ఈసీజీ టెక్నీషియన్ పోస్టులు: 13
ల్యాబొరేటరీ అసిస్టెంట్ గ్రేడ్-II పోస్టులు: 94
ఫీల్డ్ వర్కర్ పోస్టులు: 19
అర్హత:
పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో 10+2, జీఎన్‌ఎం, డిప్లొమా, డిగ్రీ, పీజీ డిప్లొమా, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి:
పోస్టులను అనుసరించి 18-43ఏళ్లు కలిగి ఉండాలి.
ఎంపిక విధానం:
సీబీటీ (కంప్యూటర్ ఆధారిత పరీక్ష), రూల్ ఆఫ్ రిజర్వేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
జీతం:
పోస్టులను అనుసరించి 19900 నుంచి 44900 అందిస్తారు.
ఫీజు:
ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికోద్యోగులు, పీడబ్ల్యూబీడీ, మహిళలు, ట్రాన్స్‌జెండర్, ఈబీసీలకు రూ.250. ఇతరులకు రూ.500 చెల్లించాల్సి ఉంటుంది.
దరఖాస్తు విధానం :
ఆన్ లైన్
దరఖాస్తులు ప్రారంభ తేదీ:
17-08-2024
దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ:
16-09-2024