నిస్సాన్‌ నుంచి 2 కొత్త కార్లు

జపాన్‌ కార్ల కంపెనీ నిస్సాన్‌.. భారత మార్కెట్లోకి 2 కొత్త కార్లను ప్రవేశపెట్టబోతోంది. అందులో 7 సీట్ల సామర్థ్యంతో కూడిన బీ-ఎంపీవీని (మల్టీ పర్పస్‌ వెహికిల్‌) కొత్త ఆర్థిక సంవత్సరం (2025-26) తొలినాళ్లలో అందుబాటులోకి తేనున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఆ తర్వాత 5 సీట్ల సామర్థ్యంతో కూడిన కాంపాక్ట్‌ ఎస్‌యూవీని విడుదల చేస్తామని పేర్కొంది. దేశీయ మార్కెట్లో విడుదల చేయనున్న ఈ రెండు కొత్త కార్లను కంపెనీ జపాన్‌లోని యోకోహామాలో ఈ మధ్యనే నిర్వహించిన గ్లోబల్‌ ప్రొడక్ట్‌ షోకాజ్‌ ఈవెంట్‌లో ప్రదర్శించింది. నిస్సాన్‌ ప్రస్తుతం మాగ్నైట్‌, ఎక్స్‌-ట్రయల్‌ మోడళ్లను మన మార్కెట్లో విక్రయిస్తోంది.