పోస్టల్‌ శాఖలో 44,228 పోస్టులు.. తెలుగు రాష్ట్రాల తొలి మెరిట్‌ లిస్ట్‌ వచ్చేసింది

www.mannamweb.com


దేశవ్యాప్తంగా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పోస్టల్‌ శాఖలోని జీడీఎస్‌ పోస్టుల ఫలితాలు ఎట్టకేలకు వచ్చేశాయి. వివిధ పోస్టల్ సర్కిళ్లలోని బ్రాంచ్‌ పోస్ట్ ఆఫీసుల్లో 44,228 గ్రామీణ డాక్ సేవక్ (GDS) పోస్టులకు దరఖాస్తు చేసి ఫలితాల కోసం ఎదురుచూస్తోన్న అభ్యర్థులకు ఊరట లభించినట్లైంది.

మొత్తం పోస్టుల్లో ఆంధ్రప్రదేశ్ 1,355 పోస్టులు ఉండగా, తెలంగాణలో 981 చొప్పున పోస్టులను భర్తీ చేస్తున్నారు. జీడీఎస్‌ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల తొలి జాబితాను తాజాగా పోస్టల్‌ శాఖ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారిని మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, వారందరికీ సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌కు పిలుస్తారు. పదో తరగతి అర్హతతో ఎంపిక చేస్తారు. పైగా ఎలాంటి రాత పరీక్ష నిర్వహించకుండానే పదో తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. తాజాగా విడుదల చేసిన తొలి జాబితాలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నుంచి 1355 మందిని, తెలంగాణ రాష్ట్రం నుంచి 981 మందిని షార్ట్‌ లిస్ట్‌ చేశారు. ఎంపికైన అభ్యర్థుల వివరాలను వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచారు.

తొలి సెలక్షన్‌ లిస్టును కంప్యూటర్ జనరేటెడ్‌ పద్ధతిలో మార్కుల ప్రాధాన్యం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా పంపిచంఆరు. ఈ ప్రక్రియలో షార్ట్‌లిస్ట్‌ అయిన అభ్యర్థులు సెప్టెంబర్‌ 3 లోగా సంబంధిత కార్యాలయాల్లో ధ్రువపత్రాల పరిశీలనకు హాజరుకావాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్‌గా సేవలు అందిస్తారు.

సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌కు హాజరయ్యే అభ్యర్ధులు ఈ కింది సర్టిఫికెట్లను తప్పనిసరిగా కలిగి ఉండాలి. అవేంటంటే..

దరఖాస్తుకు సంబంధించిన ఆన్‌లైన్‌ అప్లికేషన్‌
పుట్టిన తేదీ ధ్రువీకరణకు పదో తరగతి మార్కుల మెమో
6 నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు
అభ్యర్థి పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటోలు
ట్రాన్స్‌ఫర్‌ సర్టిఫికెట్‌
కుల ధ్రువీకరణ పత్రం
దివ్యాంగులైతే దివ్యాంగ ధ్రువీకరణ పత్రం
ఆధార్‌ కార్డు
ఇన్‌కాం సర్టిఫికెట్‌
మెడికల్‌ సర్టిఫికెట్‌