ప్రపంచంలోనే అత్యంత భారీ, సుదీర్ఘ మానవ నిర్మిత అగ్నిగుండం విషయం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతానికి మంటలు తగ్గుతున్నాయని అక్కడి అధికారులు చెబుతున్నారని కథనాలొస్తున్నా..
దానిపై పూర్తి స్పష్టత లేదనే చెప్పాలి. దీంతో.. ఏమిటీ అగ్నిగుండం.. ఏ దేశంలో ఉంది.. ఎందుకు అలా మండుతోంది.. ఎంతకాలంగా మండుతోంది అనే విషయాలు ఇప్పుడు చూద్దామ్..!
అవును… 1995 – 96 సమయంలో ఆంధ్రప్రదేశ్ లోని అప్పటి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా, కోనసీమ ప్రాంతంలోని పాశర్లపూడిలో ఆయిల్ అండ్ నేచురల్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ) బావిలో భారీ బ్లోఅవుట్ జరిగింది. దీంతో సుమారు 60 రోజులపాటు ఎత్తైన కొబ్బరి చెట్ల మొవ్వులు మాడిపోయేలా మంటలు వ్యాపించాయి. ఇది ఓఎన్జీసీ చరిత్రలోనే రెండో అతిపెద్ద ప్రమాదంగా గుర్తించబడింది.
ఈ సమయంలో సుమారు 50 సంవత్సరాలకు పైగా మండుతోంది ఓ అగ్నిగుండం! అదే తుర్క్మెనిస్తాన్ లోని “గేట్ వే టు హెల్” లేదా “షైనింగ్ ఆఫ్ కురుకామ్”గా పిలవబడే మానవ నిర్మిత అగ్నిగుండం. ఇది సుమారు 100 అడుగుల లోతు, 230 అడుగుల వెడల్పు ఉంటుంది! 1971లో సోవియెట్ శాస్త్రవేత్తలు దానిపై ప్రయోగాలు చేయడానికి ప్రయత్నించినప్పుడు మండించిన ఓ భారీ గ్యాస్ బావి ఇది!
వివరాళ్లోకి వెళ్తే… 1971లో సోవియట్ ఆయిల్ రిగ్ ఈ బిలంలో పడిందని.. ఆ సమయంలో ఆ బిలానికి నిప్పు పెట్టడం ద్వారా ఆ రిగ్ ను తొలగించొచ్చని ఓ భూవిజ్ఞాన శాస్త్రవేత్త భావించారని.. దీంతో ఆ బిలానికి నిప్పుపెట్టారని.. అలా నాడు మొదలైన గ్యాస్ ఆధారిత మంటలు నేటికీ మండుతూనే ఉన్నాయని చెబుతారు. సందర్శకులు దీనికి దగ్గరగా వెళ్లకుండా 2018లో భద్రతా కంచెను ఏర్పాటు చేశారు.
కరకుమ్ ఎడారిలోని మారుమూల ప్రాంతంలో దిబ్బలు, రాతి గుట్టలతో చుట్టుముట్టబడిన ఈ అగ్ని బిలం పర్యాటనకులను ఎక్కువగా ఆకర్షిస్తుంది. అది ఎంతలా అంటే.. మద్య ఆసియా దేశంలోని దాదాపు ప్రతీ పర్యటనలోనూ ఇది అగ్రస్థానంలో ఉంటుందని చెబుతారు.
కెనడియన్ సాహసికుడు, టెలివిజన్ ప్రెజెంటర్, ప్రధానంగా ఈ గ్యాస్ బిలంలోపల అన్వేషించిన ఏకైన వ్యక్తి అయిన జార్జ్ కౌరౌనిస్ స్పందిస్తూ… ఇది ఎలా ప్రారంభమైందనే దానిపై చాలా వివాదాలు, భిన్నాభిప్రాయాలు ఉన్నాయని.. అందులో ఎది నమ్మాలో తనకు తెలియడం లేదని.. దీనిపై అనేక కథలు, పురణాలు వినిపిస్తున్నాయని తెలిపారు.






























