గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ చిత్రం రాబోతోంది. ఇక ఈ మూవీకి సంబంధించి ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఏ టైమ్ లో అయినా షూటింగ్ స్టార్ట్ కావొచ్చు. అందుకు తగ్గట్లుగా మేకర్స్ పక్కా ప్లానింగ్ తో ముందుకు సాగుతున్నారు. ఇక 90-80లో గ్రామీణ నేపథ్యంలో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ తెరకెక్కబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీకి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. మనం ఊహించిన దానికంటే ఎక్కువే ఈ సినిమా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో కేవలం సెట్స్ కోసమే ఏకంగా రూ. 80 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు వినికిడి.
RC 16 త్వరలోనే షూటింగ్ ప్రారంభించడానికి రెడీ అవుతోంది. ఏ క్షణంలోనైనా షూటింగ్ స్టార్ట్ కావొచ్చు. కాగా.. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కబోయే ఈ చిత్రం కోసం న్యాచురల్ లుక్ రావడానికి రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్లను వేయిస్తున్నాడు డైరెక్టర్ బుచ్చిబాబు. ఒరిజినల్ లుక్ రావడం కోసం ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సెట్లు వేస్తున్నారు. కేవలం సెట్స్ కోసమే ఏకంగా రూ. 80 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. బడ్జెట్ విషయంలో మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్ ఎక్కడా కూడా తగ్గట్లేదు. మంచి అవుట్ పుట్ ను ప్రేక్షకులకు అందించాలనే ఉద్దేశంతో మేకర్స్ ఉన్నారు. బుచ్చిబాబు విజన్ కు తగ్గట్లుగా అతడు కోరుకున్న విధంగా సెట్స్ డిజైన్ చేయాలని స్ట్రిక్ట్ ఆదేశాలన ప్రొడక్షన్ టీమ్ ఇచ్చారట. అందుకు అనుగుణంగా పనులు సాగుతున్నట్లు తెలుస్తోంది.
అయితే కేవలం సెట్స్ కోసమే 80 కోట్లు పెడుతున్నారంటే? అవి ఎంత న్యాచురల్ గా ఉంటాయో అర్థం అవుతుంది. ఇక ఈ మూవీ కోసం దాదాపు రూ. 200 కోట్ల బడ్జెట్ కేటాయిస్తున్నట్లు సమాచారం. అయితే అనుకున్నదాని కంటే కాస్త ఎక్కువే అయ్యేలా ఉంది. దీనికి మైత్రీ మూవీస్, వృద్ధి సినిమాస్ రెడీగా ఉన్నాయట. ఇదిలా ఉండగా.. ఆర్సీ 16 కోసం తన బాడీని రెడీ చేస్తున్నాడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. ఇందుకోసం అతడు ఆస్ట్రేలియాకి స్పెషల్ ట్రైనింగ్ కు వెళ్లినట్లు సమాచారం. అక్కడే కొన్ని రోజులు ఉండి.. తన బాడీని మూవీ తగ్గట్లుగా మేకోవర్ చేసుకోబోతున్నాడు. కాగా.. చరణ్ కు జోడీగా ఈ చిత్రంలో బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ నటిస్తుండగా.. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. ఇక మీరు సెట్స్ కోసం పెట్టే బడ్జెట్ తో 4 చిన్న సినిమాలు తీయోచ్చని నెటిజన్లు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.