Health Benefits Of Ridge Gourd: వేసవిలో బీరకాయ తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

www.mannamweb.com


Health Benefits Of Ridge Gourd: కూరగాయల్లో బీరకాయకు ఉండే ప్రత్యేకత వేరు. బీరకాయ అంటే చాలా మంది ఇష్టంగా తింటారు. బీరకాయ కూర, బీరకాయ పప్పు, బీరకాయ కోడిగుడ్డు, బీరకాయ పచ్చడి లాంటివి చేసుకుని తినడానికి ఇష్టపడుతుంటారు.ముఖ్యంగా వేసవిలో బీరకాయను ఎక్కువగా తీసుకోవాలి. బీరకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల దీనిని ఎవరైనా ఎప్పుడైనా తినవచ్చు. బీరకాయలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి.

బీరకాయ తినడానికి కూడా తొందరగా జీర్ణం అవుతుంది. ముఖ్యంగా బీరకాయను వేసవికాలంలో తీసుకోవడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు ఉంటాయి. బీరకాయలో 92 శాతం నీరు ఉంటుంది. దీనివల్ల శరీరానికి వేసవికాలంలో అనేక ప్రయోజనాలు ఉంటాయి. బీరకాయలోని పొటాషియం, సోడియం, మెగ్నీషియం పుష్కలంగా ఉండడం వల్ల బీరకాయను తీసుకుంటే బాడీ హైడ్రేట్ అవుతుంది.

డయాబెటీస్ వ్యాధితో బాధపడుతున్న వారికి కూడా బీరకాయ తోడ్పడుతుంది. బీరకాయను తినడం వల్ల మెగ్నీషియం అధికంగా ఉండి ఎక్కువసేపు ఆకలి కాకుండా చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను కూడా నివారించడానికి బీరకాయ తోడ్పడుతుంది. బీరకాయలో ఉండే మెగ్నీషియం వంటి ఇన్సులిన్ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. అంతేకాదు బరువు తగ్గేందుకు కూడా బీరకాయ తోడ్పడుతుంది. బీరకాయలో ఉండే కేలరీలు, ఫైబర్, నీరు బరువును తగ్గించేందుకు కూడా సహాయపడతాయి.

బీరకాయ తినడం వల్ల జీర్ణక్రియ వ్యవస్థ కూడా మెరుగవుతుంది. బీరకాయలో ఉండే ఫైబర్ మలబద్ధకాన్ని నివారిస్తుంది. బీరకాయలోని పొటాషియం రక్తపోటును నియంత్రించడం, రక్తనాళాలపై ఒత్తిడిని తగ్గించేందుకు ప్రయత్నిస్తుంది. క్యాన్సర్ వంటి అనేక ప్రమాదాల నుంచి బీరకాయలోని పోషకాలు తగ్గించడానికి తోడ్పడతాయి. రోగనిరోధక శక్తిని పెంచి, ఇమ్యూనిటీ వ్యవస్థలను బలపరచేందుకు కూడా బీరకాయ ఉపయోగపడుతుంది.