Noise Pop Buds : మార్కెట్‌లో ఇయర్‌బడ్స్‌కు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్ కనెక్టెడ్ గ్యాడ్జెట్లను ఉపయోగించేందుకు ఎక్కువగా ఇంటరెస్ట్ చూపుతున్నారు. ఈ క్రమంలోనే కొత్తకొత్త కంపెనీలు ఈ మార్కెట్‌లో రకరకాల ఉత్పత్తులును తీసుకొస్తున్నాయి. అయితే తాజాగా నాయిస్ పాప్ బడ్స్ భారతదేశంలో ప్రారంభించబడ్డాయి. కొత్త TWS బడ్‌లు ఎన్విరాన్‌మెంట్ నాయిస్ క్యాన్సిలేషన్ (ENC), 50 గంటల బ్యాకప్ బ్యాటరీ, క్వాడ్ మైక్ సెటప్‌తో తీసుకొచ్చారు. వీటిని నాలుగు కలర్ ఆప్షన్లలో కొనుగోలు చేయవచ్చు. వాటి ధర కూడా రూ.1000 లోపే ఉంటుంది. వాటి ధర, స్పెసిఫికేషన్‌లను తెలుసుకోండి.
నాయిస్ సరికొత్త బడ్స్‌ను రూ.3,499 ధరతో విడుదల చేయగా లాంచింగ్ ఆఫర్ కింద 68 శాతం డిస్కౌంట్ అందిస్తున్నారు. దీంతో బడ్స్‌ను రూ.999లతో కొనుగోలు చేయవచ్చు. వీటిని ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్, నాయిస్ ఇండియా వెబ్‌సైట్ నుండి కొనుగోలు చేయవచ్చు. ఫారెస్ట్ పాప్, లిలక్ పాప్, మూన్ పాప్, స్టీల్ పాప్ కలర్ ఆప్షన్‌లు ఇందులో అందుబాటులో ఉన్నాయి. ఇందులో 50 గంటల బ్యాకప్‌ని అందించే బ్యాటరీ ఉంది. పూర్తిగా ఛార్జ్ చేయడానికి దాదాపు 90 నిమిషాల టైమ్ పడుతుంది.
స్పెసిఫికేషన్లు, బ్యాటరీ విషయానికి వస్తే నాయిస్ పాప్ బడ్స్‌లో 50 గంటల బ్యాకప్‌ని అందించే బిగ్ బ్యాటరీ ఉంది. ఇది పూర్తిగా ఛార్జ్ కావడానికి దాదాపు 90 నిమిషాల సమయం పడుతుంది. అలానే ఇందులో మరో ప్రత్యేకత ఏమిటంటే ఇన్‌స్టాఛార్జ్ సౌకర్యం కూడా ఉంది. 10 నిమిషాల ఛార్జింగ్‌లో 150 నిమిషాల బ్యాకప్ అందించగలదని కంపెనీ తెలిపింది.
నాయిస్ TWS ఎన్విరాన్‌మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ (ENC)తో వస్తుంది. ఇది కాల్స్‌లో బ్యాక్‌గ్రౌండ్ శబ్దాన్ని తగ్గిస్తుంది. వీటికి 10ఎంఎం డ్రైవర్లు అందించారు. వీటిలో బ్లూటూత్ 5.3 కనెక్టివిటీ ఉపయోగించారు. ఇది గరిష్టంగా 10 మీటర్ల పరిధిని అందిస్తుంది.
దీంతోపాటు గూగుల్ అసిస్టెంట్, సిరి వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. వాటిని స్ప్లాష్ ఫ్రీగా చేయడానికి IPX5 రేటింగ్ ఉంది. తద్వారా వాటర్, స్వెట్, డస్ట్ నుంచి సేఫ్‌గా ఉంటాయి. బడ్స్‌పై కంపెనీ ఏడాదిపాటు వారెంటీ కూడా అందిస్తుంది.
అదే సమయంలో నాయిస్ స్మార్ట్‌వాచ్‌లపై 80 శాతం వరకు డిస్కౌంట్ ఇస్తుంది ఫ్లిప్‌కార్ట్. ఆఫర్లలో, నాయిస్ కలర్ ఫిట్ పల్స్ 2 మాక్స్, నాయిస్ ఫిట్ హాలో ప్లస్, నాయిస్ బడ్స్ ఎక్స్ ప్రైమ్ పై డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి.