5 నెలల్లో 30 వేల మందిని చంపాడు! ఇరాన్‌ అధ్యక్షుడి రక్తచరిత్ర!

www.mannamweb.com


ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్‌ ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. 63 ఏళ్ల రైసీ.. తూర్పు అజర్‌బైజాన్‌కు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

ఇరాన్ రాజధాని టెహ్రాన్‌కు 600 కిలోమీటర్ల దూరంలో ఉన్న అజర్‌బైజాన్ సరిహద్దు నగరం జోల్ఫా సమీపంలో ప్రమాదం జరిగింది. అయితే.. ప్రమాదంలో చనిపోయిన ఇబ్రహీం రైసీ.. గతం అంత గొప్పగా ఏం లేదు. ఎన్నికల్లో రిగ్గింగ్‌కు పాల్పడి మరీ ఇరాన్‌కు అధ్యక్షుడయ్యాడు. అలాగే.. అధ్యక్షుడు కాకముందు ఇరాన్‌ న్యాయ వ్యవస్థలో ఎన్నో కీలక విధులు నిర్వహించిన రైసీ.. తన హయంలో చరిత్ర సిగ్గుపడే ఘటనలో భాగస్వామ్యం అయ్యాడు. ‘అదే 1988 ఉరి శిక్షలు’. ప్రస్తుతం ఇరాన్‌ అధ్యక్షుడి మరణంతో.. 1988లో జరిగిన దారుణం మరోసారి చర్చలో భాగమైంది.

ఇరాన్‌ దేశంలో రాజకీయ ఖైదీలను అత్యంత దారుణంగా ఉరి వేసి చంపేశారు. 1988లో ఇరాన్ రాజకీయ ఖైదీలను ఉరితీసిన నలుగురు వ్యక్తులలో ఒకరిగా రైసీని హుస్సేన్-అలీ మోంటజేరి పేర్కొన్నారు. ఆయనతో పాటు మోర్టెజా ఎష్రాఘి(ప్రాసిక్యూటర్ ఆఫ్ టెహ్రాన్), హోస్సేన్-అలీ నయేరీ(న్యాయమూర్తి), మోస్తఫా పూర్మొహమ్మది(ఎవిన్‌లో ఎంఓఐ ప్రతినిధి). కొన్ని వేల మంది రాజకీయ ఖైదీలు అక్రమంగా విధించిన మరణశిక్షల్లో ప్రాసిక్యూషన్‌ కమిటీ ప్రమేయం ఉందనే కారణంతో.. ఈ నలుగురు వ్యక్తులు ఉన్న కమిటీని ‘డెత్‌ కమిటీ’గా పిలుస్తారు.

దేశవ్యాప్తంగా ప్రభుత్వ నిర్బంధంలో ఉన్న రాజకీయ ఖైదీలకు ఉరి అమలు చేసే ప్రక్రియ 19 జూలై 1988 నుంచి ప్రారంభం అయి.. ఓ ఐదు నెలల పాటు ఈ మరణకాండ సాగింది. దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో ఈ సామూహిక ఉరిశిక్షలు అమలు చేశారు. ఒక్కొక్కరిగా ఉరివేస్తే.. సమయం పడుతుందని.. ఆరుగురి చొప్పున భారీ క్రేన్లకు వేలాడదీసి చంపేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఇరాన్ పీపుల్స్ ముజాహెదీన్ పార్టీ, ఫెడయన్,తుదే పార్టీ ఆఫ్ ఇరాన్(కమ్యూనిస్ట్)తో పాటు ఇతర వామపక్ష వర్గాల మద్దతుదారులను ఉరితీశారు. కచ్చితంగా ఎంత మందిని ఉరితీశారు అనే సమాచారం ఇప్పటికీ లేదు. 2500 నుంచి 30 వేల మంది రాయకీయ ఖైదీలను ఉరితీసి ఉంటారని పలు నివేదికలు పేర్కొన్నాయి. హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించిన ఇబ్రహీం రైసీ 2001లో అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ఇరాన్‌లో మతతత్వ పాలనకు ఆయన గట్టి మద్దతుదారుడు. రైసీ ఇరాన్ సుప్రీం అయతుల్లా ఖమేనీకి సన్నిహిత సహచరుడు. అతని వారసుడిగా ఎదిగాడు. మరి ఈ ఇబ్రహీం రైసీపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.