మన దేశంలో నాన్‌వెజ్ ప్రియులు చాలా ఎక్కువ. శాఖాహారం తినేవారి కంటే మాంసాహారం తినేవారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. నాన్‌వెజ్ తినాలంటే సుమారు 99 శాతం మంది కచ్చితంగా నిమ్మకాయ పిండుకొని తింటుంటారు.
నిమ్మకాయ పిండుకోకపోతే కొందరికి ముద్ద కూడా దిగదు. అయితే నిమ్మకాయ పిండుకొని తినడం వలన ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? నిమ్మకాయ పిండుకొని తినడం మంచిదేనా? నిమ్మకాయతో ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
నాన్‌వెజ్‌పై నిమ్మకాయ పిండుకొని తినడం వల్ల కలిగే ప్రయోజనాలు
రుచి డబల్ అవుతుంది
నిమ్మకాయలు ఒక ప్రత్యేకమైన రుచిని కలిగి ఉంటాయి. నిమ్మకాయలు తింటే ఒక ప్రత్యేకమైన అనుభూతి కలుగుతుంది. నిమ్మకాయలో ఉండే ఆమ్లత్వం మాంసంపై పిండినప్పుడు ఒక ప్రత్యేకమైన రుచి వస్తుంది. ఆ రుచి డబల్ అవుతుంది. అందుకే చాలా మంది మాంసంపై నిమ్మకాయ పిండుకొని తింటారు. రుచికోసం నిమ్మకాయ రసాన్ని వినియోగిస్తారు.
జీర్ణక్రియ మెరుగుపడుతుంది
ప్రపంచంలో ఎవరిని అడిగిన చెప్పేది ఒకటే.. నిమ్మకాయలో విటమిన్ సీ ఉంటుంది అని. ఆ విటమిన్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మాంసం జీర్ణం కావాలంటే సాధారణంగానే చాలా సమయం పడుతుంది. దానిపై ఒక్క నిమ్మబద్ద పిండుకొని తింటే రుచితో పాటు ఆ మాంసం కడుపులో తొందరగా జీర్ణమవుతుంది.
కడుపులోని బ్యాక్టీరియాలను నాశనం చేస్తుంది
నిమ్మకాయలో యాంటీ బ్యాక్టీరియాల్ గుణాలు ఉంటాయి. ఆ గుణాలు మాంసంలోని బ్యాక్టీరియాలను నాశనం చేస్తుంది. మాంసంలో అనేక రకాల బ్యాక్టీరియాలు ఉంటాయి. ఆ బ్యాక్టీరియాలను నాశనం చేయాలంటే నిమ్మకాయ పిండుకొని తింటే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. దీంతో పాటు బ్యాక్టీరియాలు కూడా నాశనమవుతాయి.
రోగ నిరోధక శక్తి
నిమ్మకాయలో విటమిన్ సీ పుష్కలంగా ఉంటుంది. విటమిన్ సీ కారణంగా రోగ నిరోధక శక్తి భారీగా పెరుగుతుందన్న విషయం తెలిసిందే. అయితే మాంసంలో విటమిన్ సీ పిండుకొని తినడం వల్ల శరీరానికి కావాల్సిన విటమిన్ సీ పుష్కలంగా లభిస్తుంది. ఇది శరీరానికి కావాల్సిన రోగ నిరోధక శక్తిని అందిస్తుంది. దీంతో ఎలాంటి వైరల్ ఇన్ఫెక్షన్ బారిన పడుకుంటా ఉంటాము.
కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం:
మాంసంపై నిమ్మకాయ పిండుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు మాత్రం కచ్చితంగా తీసుకోవాలి. అందులో ముఖ్యమైనది ఎక్కువగా నిమ్మకాయను పిండకూడదు. దీనివల్ల ఆహరం పుల్లగా మారుతుంది. అలాగే జీర్ణ సంబంధిత సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశాలు చాలా ఉంటాయి. అలాగే తాజాగా లేని మాంసంపై నిమ్మకాయ ఎట్టి పరిస్థితుల్లోనూ పిండకూడదు. తాజాగా లేని మాంసంపై నిమ్మకాయ పిండడం అనేది మన శరీరానికే చాలా హానికరం. అందుకే తాజాదనం లేని మాంసంపై నిమ్మకాయ పిండకూడదు.