Vijayasai Reddy in a new role..! జగన్ కు లేఖ-కేంద్రానికి సలహా..!

ఏపీ రాజకీయాల్లో నిన్న మొన్నటివరకూ యాక్టివ్ గా ఉన్న వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి ఉన్నట్లుండి ఎంపీ పదవికి రాజీనామా చేసేసి రాజకీయాలకే గుడ్ బై చెప్పేశారు. అంతే కాదు తన నిర్ణయాల వెనుక ఎవరి ఒత్తిళ్లూ లేవని చెప్పేశారు. అయితే సాయిరెడ్డి పైకి ఏం చెబుతున్నా అంతర్గతంగా మాత్రం ఆయన అడుగులు బీజేపీ వైపే పడతాయన్న ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో సాయిరెడ్డి కీలక అడుగులు వేస్తున్నారు.


తాజాగా వైసీపీ ఎంపీ పదవికి రాజీనామా చేసి, అనంతరం రాజకీయాలకు గుడ్ బై చెప్పిన విజయసాయిరెడ్డి తాజాగా తన మాజీ బాస్ వైఎస్ జగన్ కు రాజీనామా లేఖల్ని పంపారు. పార్టీ పదవులకు రాజీనామా చేస్తూ తాను వైఎస్ జగన్ కు లేఖలు పంపినట్లు సాయిరెడ్డి తాజాగా ట్వీట్ చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, పార్టీ పదవులకు ఈ రోజు నా రాజీనామాను పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి పంపించినట్లు తెలిపారు.

అలాగే 2029 ఎన్నికల్లో వైయస్ జగన్ భారీ మెజారిటీతో మరోసారి ముఖ్యమంత్రి కావాలని నిండు మనసుతో కోరుకుంటున్నానని తెలిపారు. తన రాజకీయ ప్రయాణంలో అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నట్లు పేర్కొన్నారు. అక్కడితో ఆగకుండా శత్రుత్వాలకు, అపార్థాలకు అవకాశం ఇవ్వని విధంగా జీవించాలని వ్యవసాయ ప్రపంచంలో తన మరో ప్రస్థానాన్ని ప్రారంభించానని తెలిపారు. ఈ ట్వీట్ చేసిన కొన్నిగంటల్లోనే కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి మరో ట్వీట్ పెట్టారు. ఇందులో సాయిరెడ్డి బడ్జెట్ పై కేంద్రానికి సలహాలు ఇచ్చారు. యువత శక్తి భారతదేశం యొక్క అతిపెద్ద మూలధనం అని, ఇది మనకు 10 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా మారుతుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఈ యువ శక్తిని సరైన దిశలో ఉంచాలని, తద్వారా ఇది నిరుద్యోగం కాకుండా దేశ నిర్మాణంలో నిమగ్నమై ఉంటుందన్నారు.

నైపుణ్యం అభివృద్ధి, స్టార్టప్‌లు, ఇన్నోవేషన్, పరిశ్రమ అనుసంధాన విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. సరైన విధానాలు, సరైన మార్గదర్శకత్వం భారతదేశాన్ని ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుస్తుందన్నారు. యువత శక్తి యొక్క సరైన ఉపయోగం, అభివృద్ధి చెందిన మరియు స్వీయ -సప్లిసిటీ భారతదేశంలో అతిపెద్ద కీ అని ముగించారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.