Holi Offer : కేవలం రూ.1,199కే విమాన ప్రయాణం… రేపు చివరి తేదీ

విమాన ప్రయాణం ఇప్పుడు ట్రైన్ టికెట్ ధరకే! మీరు ఎక్కడికైనా ట్రిప్ ప్లాన్ చేస్తుంటే ట్రైన్ కంటే ఇప్పుడు ఫ్లైట్ జర్నీ బెటర్… కారుచౌకగా టికెట్లు బుక్ చేసుకోవచ్చు.


ఇంతకూ ఈ ఆఫర్ ఏంటో తెలుసా?

ఇండిగో ఎయిర్‌లైన్స్ హోలీ పండుగ కోసం సూపర్ ఆఫర్ తెచ్చింది. దేశంలోనే అతిపెద్ద డొమెస్టిక్ ఎయిర్‌లైన్ ఇండిగో తమ ప్రయాణికులకు హోలీ సందర్భంగ స్పెషల్ డిస్కౌంట్ ఇస్తోంది. ఈ ఆఫర్ కింద దేశంలో, విదేశాల్లో కూడా తక్కువ ధరకే ప్రయాణించవచ్చు.

ఇండిగో ‘హోలీ గెట్‌అవే సేల్’ స్టార్ట్ చేసింది. ఇందులో తక్కువ ధరకే ఫ్లైట్స్ బుక్ చేసుకోవచ్చు. మార్చి 10 నుంచి ఈ సేల్ మొదలైంది. మార్చి 12 వరకు ఉంటుంది. మార్చి 17, 2025 నుంచి సెప్టెంబర్ 21, 2025 వరకు ప్రయాణానికి టికెట్లు బుక్ చేసుకోవచ్చు.

‘హోలీ గెట్‌అవే సేల్’లో ఇండిగో వన్-వే టికెట్లను ₹1,199 నుంచి స్టార్ట్ చేస్తోంది. ఇంటర్నేషనల్ టూర్స్ కోసం టికెట్లు ₹4,199 నుంచి మొదలవుతాయి. అదనంగా ఇండిగో యాడ్-ఆన్స్‌పై డిస్కౌంట్స్ ఇస్తోంది. డొమెస్టిక్, ఇంటర్నేషనల్ టికెట్లపై 15 కేజీలు, 20 కేజీలు, 30 కేజీల ప్రీపెయిడ్ ఎక్స్‌ట్రా లగేజీపై 20% వరకు తగ్గింపు పొందండి.

ఈ ఇండిగో ఆఫర్ కింద మీకు ఇష్టమైన సీటును బుక్ చేసుకోవాలనుకుంటే 35 శాతం డిస్కౌంట్ పొందవచ్చు. ఫుడ్‌పై కూడా 10 శాతం డిస్కౌంట్ ఉంది. ఎమర్జెన్సీ XL సీటు ధర డొమెస్టిక్‌లో ₹599 నుంచి, ఇంటర్నేషనల్‌లో ₹699 నుంచి స్టార్ట్ అవుతుంది. ఫాస్ట్ ఫార్వర్డ్‌పై 50% వరకు, 6E ప్రైమ్, 6E సీట్ & ఈట్‌పై 30% వరకు తగ్గింపు పొందండి.

వీటన్నిటితో పాటు ఇండిగో వెబ్‌సైట్ లేదా ఇండిగో మొబైల్ యాప్ ద్వారా ఫ్లైట్ బుకింగ్స్‌పై 5 శాతం డిస్కౌంట్ పొందవచ్చు. కాబట్టి మీరు మీ ఫ్యామిలీతో లేదా ఫ్రెండ్స్‌తో ఎక్కడికైనా వెళ్లాలని ప్లాన్ చేస్తుంటే, ఈ ఆఫర్ మీకు బాగా ఉపయోగపడుతుంది.