ఒకప్పుడు కేవలం మెగా హీరోలతో మాత్రమే సినిమాలు చేస్తూ వచ్చిన ‘గీతా ఆర్ట్స్'(Geetha Arts) సంస్థ ఇప్పుడు బయట హీరోలతో కూడా వరుసగా సినిమాలు చేస్తుంది. రీసెంట్ గా అక్కినేని నాగ చైతన్య(Akkineni Naga Chaitanya) తో ‘తండేల్'(Thandel Movie) అనే చిత్రం చేసి భారీ విజయాన్ని అందుకున్న ఈ సంస్థ, త్వరలోనే రామ్ పోతినేని(Ram Pothineni) తో ఒక సినిమా చేయబోతోందని లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్. ‘తండేల్’ చిత్రానికి దర్శకత్వం వహించిన చందు మొండేటి ఈ సినిమాకి కూడా దర్శకత్వం వహించబోతున్నట్టు తెలుస్తుంది. అల్లు అరవింద్(Allu Aravind), బన్నీ వాసు(Bunny Vasu) ఈ చిత్రం కోసం వంద కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేయబోతున్నారని లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్. ఇప్పటికే చందు మొండేటి(Chandoo Mondeti) తమిళ హీరో సూర్య కోసం ఒక కథ ని సిద్ధం చేసి పెట్టాడు. ఆయన్ని కలిసి స్టోరీ ని వినిపించగా, కచ్చితంగా ఈ సినిమా మనం చేస్తున్నాం అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.
కానీ సూర్య(Suriya Sivakumar) డేట్స్ ప్రస్తుతానికి ఖాళీగా లేవు. కార్తీక్ సుబ్బరాజ్ తో ‘రెట్రో’ చిత్రాన్ని పూర్తి చేసిన సూర్య, త్వరలోనే సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో వెంకీ అట్లూరి తెరకెక్కించబోయే తెలుగు సినిమాలో హీరో గా నటించబోతున్నాడు. ఈ సినిమా మరో నెల రోజుల్లో మొదలు కానుంది. ఈ లోపు చందు మొండేటి రామ్ తో సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నాడు. ప్రస్తుతానికి రామ్ పి. మహేష్ బాబు దర్శకత్వం లో ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ అనే సినిమాలో నటిస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ఈ ఏడాదిలోనే విడుదలకు సిద్ధం గా ఉంది. వరుస ఫ్లాప్స్ లో ఉన్న రామ్ ఈ సినిమా తో భారీ హిట్ కొట్టి బౌన్స్ బ్యాక్ అవ్వాలని చూస్తున్నాడు. ఇందులో ‘మిస్టర్ బచ్చన్ ‘ ఫేమ్ భాగ్యశ్రీ భోర్సే హీరోయిన్ గా నటిస్తుంది. అంతే కాకుండా ఇందులో ఒక ప్రముఖ సూపర్ స్టార్ కీలక పాత్రలో కనిపించబోతున్నట్టు కూడా టాక్ వినిపిస్తుంది.
రామ్ లుక్స్ కూడా విడుదల అయ్యాయి. కెరీర్ ప్రారంభం లో ఎలాంటి లుక్స్ తో అయితే కనిపించేవాడో, అలాంటి లుక్స్ తోనే రామ్ ఈ సినిమాలో కనిపించబోతున్నాడు. ఈమధ్య కాలం లో వరుసగా మూడు డిజాస్టర్స్ పడడంతో, ఇక నుండి ఆచి తూచి అడుగులు వెయ్యాలని నిర్ణయించుకున్నాడు రామ్. అందుకు తగ్గట్టుగానే ఈ స్క్రిప్ట్స్ ని ఎంచుకుంటున్నాడు. త్వరలో చందు మొండేటి తో చేయబోయే సినిమా ‘కార్తికేయ’ సిరీస్ తరహా థ్రిల్లర్ జానర్ లో ఉండబోతుందని టాక్. ఈ జానర్ లో ఇప్పటి వరకు రామ్ ఒక్క సినిమా కూడా చేయలేదు. కేవలం స్టోరీ లైన్ మాత్రమే ప్రస్తుతానికి చందు వినిపించాడట. ఆ ఐడియా రామ్ కి చాలా కొత్తగా, చాలా బాగా అనిపించడంతో వెంటనే ఓకే చెప్పాడు. ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లాలంటే ఆరు నెలల సమయం పడుతుంది.
































