కేవలం 9 నెలల్లో ప్రభాస్ ‘స్పిరిట్’..సందీప్ వంగ ప్లానింగ్

ప్రభాస్(Rebel Star Prabhas) ప్రస్తుతం ఎన్నో సినిమాలను లైన్ లో పెట్టాడు. కానీ ఆయన అభిమానులతో పాటు, ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్న చిత్రం ‘స్పిరిట్’. సందీప్ వంగ(Sandeep Vanga) దర్శకత్వం వహించబోతున్న ఈ సినిమాపై అంచనాలు మామూలు రేంజ్ లో లేవు. ‘యానిమల్'(Animal Movie) లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత సందీప్ వంగ యూత్ ఆడియన్స్ కి ఐకాన్ గా మారిపోయాడు. ఇలాంటి డైరెక్టర్ చేతిలో మా హీరో సినిమా పడితే ఏ రేంజ్ లో ఉంటుందో అని ప్రతీ హీరో అభిమాని ఊహించుకుంటూ ఉంటారు. కానీ ‘ యానిమల్ ‘ చూసిన తర్వాత ప్రతీ హీరో అభిమాని ఇలాంటి డైరెక్టర్ కి ప్రభాస్ లాంటి కటౌట్ ఉన్న హీరో పడితే బాక్స్ ఆఫీస్ వసూళ్లు ఆకాశమే హద్దు అనే రేంజ్ లో ఉంటాయని బలంగా నమ్మారు. అందరూ కోరుకున్నదే జరిగింది. ఇందులో సందీప్ వంగ ప్రభాస్ ని వైల్డ్ పోలీస్ ఆఫీసర్ క్యారక్టర్ లో చూపించబోతున్నాడు.


ఎప్పుడెప్పుడు ఈ సినిమా మొదలు అవుతుందా అని అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ ‘రాజా సాబ్'(Raja Saab Movie), ‘ఫౌజీ'(Fauji Movie) చిత్రాల షూటింగ్స్ లో బిజీ గా ఉన్నాడు. ఈ సినిమాలతో పాటు ‘స్పిరిట్'(Spirit Movie) మూవీ కి డేట్స్ ఇచ్చి సమాంతరంగా షూటింగ్ చేయడానికి ప్రభాస్ సిద్దంగానే ఉన్నాడు కానీ సందీప్ వంగ మాత్రం అందుకు ఒప్పుకోవడం లేదు. ఆయన సినిమా చేస్తున్నాని రోజులు ప్రభాస్ మరో సినిమా చేయకూడదు అని కండీషన్ పెట్టాడట. అందుకే ఈ ప్రాజెక్ట్ ఇంకా సెట్స్ మీదకు వెళ్ళలేదు. రీసెంట్ గానే సందీప్, ప్రభాస్ మధ్య భేటీ జరిగింది. ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయని, తానూ అడిగినప్పుడు కేవలం ఒక 9 నెలల సమయం ఇస్తే చాలని, తొందరగా ఈ రెండు సినిమాలను పూర్తి చేసుకోవాల్సిందిగా ఆయన కోరాడు, అందుకు ప్రభాస్ ఓకే చెప్పినట్టు తెలుస్తుంది.

అంటే ఈ చిత్రం మిగతా హీరోల సినిమాలు లాగా ఏళ్ళ తరబడి షూటింగ్ జరుపుకునే అవకాశాలు లేవు అన్నమాట. కేవలం 9 నెలలు అభిమానులు ఓపిక పడితే ఈ సినిమాని పూర్తి చేసి మన ముందు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారట. అందుకు తగ్గ ప్రణాళికలు కూడా రెడీ చేస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే ఈమధ్య కాలంలో సందీప్ వంగ తన ఇంస్టాగ్రామ్ లో చిరంజీవి కి రిలేటెడ్ గా అనేక పోస్టులు పెడుతూ వస్తున్నాడు. చిరంజీవి కి ఆయన వీరాభిమాని అనే విషయం అందరికీ తెలుసు. కానీ ఎప్పుడు ఇలా సందర్భం లేకుండా చేయలేదు. ఆయన తీరుని చూస్తుంటే ‘స్పిరిట్’ చిత్రం లో మెగాస్టార్ చిరంజీవి ని ఒక ముఖ్యమైన పాత్ర కోసం ఒప్పించినట్టు తెలుస్తుంది. అదే కనుక జరిగితే బాక్స్ ఆఫీస్ వద్ద విస్ఫోటనం ఏర్పడుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు, చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.