విజయనగరంలో విషాదం.. కారులో ఊపిరాడక నలుగురు చిన్నారులు మృతి

విజయనగరం కంటోన్మెంట్‌ పరిధిలోని ద్వారపూడి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. కారు లాక్‌ పడటంలో అందులో చిక్కుకున్న నలుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు.


స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం ఉదయం నలుగురు చిన్నారులు ఆడుకునేందుకు బయటకు వెళ్లారు. ఎంతసేపైనా తిరిగి రాలేదు. వారి తల్లిదండ్రులు వెతికినా కనిపించలేదు. చివరికి స్థానిక మహిళా మండలి కార్యాలయం వద్ద ఆగి ఉన్న కారులో నలుగురు చిన్నారుల మృతదేహాలను అక్కడున్నవారు గుర్తించారు.

సరదాగా ఆడుకునేందుకు కారులోపలికి వెళ్లిన తర్వాత.. లాక్‌ పడటంతో ఊపిరి ఆడక మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతులను ఉదయ్‌ (8), చారుమతి (8), చరిష్మా (6), మనస్విగా గుర్తించారు.వీరిలో చారుమతి, చరిష్మా అక్కాచెల్లెళ్లు. ఒకేసారి నలుగురు పిల్లలు కన్నుమూయడంతో ద్వారపూడిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. చిన్నారుల మృతదేహాలను పట్టుకుని తల్లిదండ్రులు, బంధువులు రోధించడం ప్రతి ఒక్కరి హృదయాన్ని ద్రవింపజేస్తోంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.