ఫ్రాన్స్‌లోని ఓ రైతు రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యే అదృష్టం తలుపుతట్టినా, ప్రభుత్వ నిబంధనలు ఆయన ఆనందాన్ని ఆవిరి చేశాయి. తన పొలంలో సాధారణ పరిశీలన చేస్తుండగా, ఊహించని విధంగా భారీ బంగారు నిక్షేపాలు బయటపడటంతో ఆ రైతు ఆశ్చర్యాలకు గురయ్యారు.
అయితే, ఈ విషయం వెలుగులోకి వచ్చిన వెంటనే ఫ్రెంచ్ ప్రభుత్వం రంగంలోకి దిగి, తదుపరి కార్యకలాపాలన్నింటినీ నిలిపివేసింది.మధ్య ఫ్రాన్స్‌లోని ఆవెర్న్ ప్రాంతానికి చెందిన 52 ఏళ్ల రైతు మైఖేల్ డూపాంట్, రోజూ మాదిరిగానే తన వ్యవసాయ భూములను పరిశీలిస్తున్నారు. ఆ సమయంలో పొలం పక్కనే ఉన్న వాగులో ఏదో మెరుస్తున్న వస్తువు ఆయన కంటపడింది. ‘నేను రోజూలాగే నా పొలాన్ని చూసుకుంటున్నాను. అప్పుడు పక్కనే ఉన్న వాగులో బురదలో ఏదో మెరుపు కనిపించింది. కొంచెం లోతుగా తవ్వగానే, నా చేతిలో ఉన్నది చూసి నా కళ్ళను నేనే నమ్మలేకపోయాను,’ అని మైఖేల్ డూపాంట్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.ఆయన చేతికి చిక్కినవి స్వచ్ఛమైన బంగారు గడ్డలు కావడంతో ఈ వార్త వేగంగా వ్యాపించింది.
భారీ బంగారం నిల్వలు: అంచనా
ఈ ఆకస్మిక ఆవిష్కరణ గురించి తెలియగానే నిపుణులు, అధికారులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. ప్రాథమిక అంచనాల ప్రకారం, ఆ భూమిలో 150 టన్నులకు పైగా Gold Discovery ఉండవచ్చని, దీని విలువ సుమారు 4 బిలియన్ యూరోలు (దాదాపు రూ.35 వేల కోట్లకు పైగా) ఉంటుందని భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇంత భారీ మొత్తంలో బంగారం దొరకడం అనుభవజ్ఞులైన జియాలజిస్టులను సైతం ఆశ్చర్యానికి గురిచేసిందని సమాచారం.
ప్రభుత్వ నిబంధనలు: రైతు నిరాశ
అయితే, మైఖేల్ డూపాంట్ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. ప్రభుత్వ అధికారులు వెంటనే ఆ ప్రదేశానికి చేరుకుని, ఫ్రాన్స్ సహజ వనరుల చట్టాల ప్రకారం తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఎలాంటి తవ్వకాలు లేదా వెలికితీత పనులు చేపట్టరాదని ఆదేశించారు. పర్యావరణంపై ప్రభావం, చట్టపరమైన చిక్కులపై పూర్తిస్థాయి సమీక్ష నిర్వహించిన తర్వాతే తదుపరి చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.’అన్ని పరీక్షలు పూర్తయ్యే వరకు ఏమీ చేయడానికి వీల్లేదని వారు నాకు చెప్పారు. జాగ్రత్త అవసరాన్ని నేను అర్థం చేసుకున్నాను, కానీ నిరాశ చెందకుండా ఉండటం కష్టం,’ అని మైఖేల్ తన ఆవేదనను వ్యక్తం చేశారు.
ప్రైవేట్ భూముల్లో సహజ వనరులపై ప్రభుత్వ అధికారం
ప్రస్తుతం ఆ భూమిని వాణిజ్య కార్యకలాపాలకు దూరంగా ఉంచి, సీల్ చేశారు. ఫ్రాన్స్‌లో, ప్రైవేటు ఆస్తిలో సహజ వనరులు లభ్యమైనప్పటికీ, భూగర్భంలోని సంపదపై ప్రభుత్వానికే పూర్తి అధికారం ఉంటుంది.ఫ్రాన్స్‌లో ఓ రైతు చేతికి చిక్కిన భారీ బంగారు నిల్వలు, ఆయన జీవితాన్ని మార్చే అవకాశం కల్పించాయి. కానీ, ప్రభుత్వ నిబంధనలు ఆయన ఆనందాన్ని ఆవిరి చేశాయి. భవిష్యత్తులో ఈ ప్రాంతంలో తవ్వకాలు ప్రారంభమయ్యే వరకు మైఖేల్ డూపాంట్‌కు ఆశలు మాత్రమే మిగిలాయి.